calender_icon.png 26 December, 2024 | 12:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోరాడుతూనే..

19-10-2024 02:23:33 AM

  1. హమాస్ అధినేత సిన్వర్ అంతిమ క్షణాలు..
  2. డ్రోన్ వీడియోతో చిత్రీకరించిన ఇజ్రాయెల్

ఇజ్రాయెల్ దాడిలో అతను మరణించారు. ఆ దాడికి సంబంధించి.. చివరి క్షణాల డ్రోన్ వీడియో ఫుటేజీ శుక్రవారం విడుదల అయ్యింది. అందులో సగం ధ్వంసమైన ఓ భవనంలో ఒళ్లంతా దుమ్ముకొట్టుకుపోయి సోఫాలో కూర్చున్న ఓ వ్యక్తి కనిపించాడు. అతడు ముఖానికి మఫ్లర్ చుట్టుకొని ఉన్నాడు. కుడిచేయి, తలపై తీవ్ర గాయాలున్నాయి.

కదలటానికి కూడా కష్టపడుతూ ముందుకు వంగిపోతున్నాడు. అదే సమయంలో ఇజ్రాయెల్ డ్రోన్ ఎగురుతూ ఆ ఇంట్లోకి ప్రవేశించింది. డ్రోన్ శబ్దం విని వెనుదిరిగి చూసిన ఆ వ్యక్తి.. ఎడమచేయిని అతి కష్టంమీద పైకి లేపాడు. ఓ కర్రను తీసుకొని కష్టంగానే దానిపైకి విసిరాడు. అప్పుడే అక్కడికి వచ్చిన ఇజ్రాయెల్ సైనికులు అతన్ని కాల్చి చంపా రు. అతనే  హమాస్ అధినేత యాహ్యా సిన్వర్.