calender_icon.png 21 September, 2024 | 5:58 PM

ఇండియాలో కండోమ్స్ ఎక్కువగా వాడే రాష్ట్రం ఏదో తెలుసా ?

21-09-2024 04:03:03 PM

న్యూఢిల్లీ : ఎయిడ్స్, సుఖవ్యాధులు లాంటి ప్రమాదకర వ్యాధుల నేపథ్యంలో సురక్షిత శృంగారంపై అందరికీ అవగాహన పెరిగింది. దీనికి తోడు అవాంఛిత గర్భం, కుటుంబ నియంత్రణ వంటి వాటికి రక్షణ కవచాలుగా పనికొస్తాయి. ఈ విషయంలో ప్రభుత్వం చేపడుతున్న చర్యలు కూడా ఫలితాన్నిస్తున్నాయి. దీంతో కండోముల వినియోగం బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో మన దేశంలో  లైంగిక విజ్ఞానం ఏ రాష్ట్రంలో ఏ మేరకు ఉందో తెలుసుకునేందుకు జాతీయ కుటుంబ ఆరోగ్య విభాగం చేపట్టిన సర్వే చేపట్టింది. 

కండోముల వినియోగంలో  దాద్రానగర్ హవేలీ టాప్ లో నిలిచింది.10 వేల మందిలో 993 మంది కండోములు వాడుతున్నారు. రాష్ట్రాలలో ఆంధ్ర ప్రదేశ్ అగ్ర స్థానంలో ఉంది.  ప్రతి 10 వేల మందిలో 978 మంది జంటలు కండోములు వాడుతున్నారు. నో కండోమ్ అని చెప్పే వాళ్లు బెంగుళూరు నగరంలో ఎక్కువ అంటున్నారు. బెంగుళూరు వాసులు కేవలం 10 వేల మందిలో 307 మంది కపుల్స్ మాత్రమే కండోములు వాడుతున్నారని సర్వే తెలిపింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం భారత్‌లో క్రమంగా కండోముల వినియోగం తగ్గుతోందట. దేశంలో ప్రతి ఏడాది 3.3 బిలియన్ల కండోములు అమ్ముడుపోతు న్నాయి. వీటిలో 53 లక్షల కండోములు ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే వినియోగిస్తున్నారట. యూపీ అతిపెద్ద రాష్ట్రం కావడం, కండోముల వినియోగంపై యోగి ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేయడం కూడా ఇందుకు కారణం.