calender_icon.png 26 October, 2024 | 9:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓవైసీ అయినా.. మల్లారెడ్డి అయినా ఒకటే రూల్

28-08-2024 12:56:32 AM

విద్యార్థుల చదువులు దెబ్బతినొద్దని భావిస్తున్నాం 

వారికి ఇబ్బంది కలగకుండా యాజమాన్యాలకు టైం ఇస్తాం 

అక్రమంగా నిర్మిస్తే ధర్మసత్రాలనైనా కూల్చేస్తాం  

హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 27 (విజయక్రాంతి): ఓవైసీ అయినా.. మల్లారెడ్డి అయినా ఒకటే రూల్ అమలు చేస్తాం. కానీ, ప్రస్తుతం విద్యా సంవత్సరం మధ్యలో ఉన్న నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్ ఆగం కావొద్దు. చెరువులలో ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మాణాలు చేసిన పలు విద్యా సంస్థలకు కొంత టైం ఇస్తున్నాం. హైడ్రా ఎప్పుడూ నోటీసులు ఇవ్వదు. అక్ర మ నిర్మాణాలు చేపట్టిన ధర్మ సత్రాలనైనా కూలుస్తాం.. అంటూ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

సలకం చెరువు ఎఫ్‌టీఎల్‌లో నిర్మాణం చేసిన ఎంపీ ఓవైసీకి చెందిన ఫాతిమా కళాశాలను కూల్చివేయాలంటూ బీజేపీకి చెంది న పలువురు కార్పొరేటర్లు మంగళవారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో సంచలనంగా మారా యి. ఆయన మాటల్లోనే.. ఓవైసీ అయినా, మల్లారెడ్డి అయినా.. రూల్ ఒకటే. ప్రస్తుతం విద్యా సంవత్సరం మధ్యలో ఉంది. ఈ సమయంలో చర్యలు తీసుకుంటే విద్యార్థులు నష్టపోతారు. ఈ నేపథ్యంలో పిల్లల భవిష్యత్ ఆగం కావొద్దనే అక్రమ కట్టడాలు తొల గించేందుకు కొంత సమయం ఇస్తున్నాం.

వాళ్లకు వాళ్లుగా తొలగించకపోతే హైడ్రానే చర్యలు తీసుకుంటుంది. చెరువులలో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లు కూడా ముఖ్యమైనవే. కానీ, అంతకంటే విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుంటున్నాం. రాజకీయాలకు అతీతంగా కూల్చివేతలు చేపడుతున్నాం. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులలో రాజకీయాలు అసలేం చూడం. ఫిర్యాదులో పేర్కొ న్న విషయం సరైందా.. కాదా అని మాత్రమే చూస్తాం. ఓవైసీ అయినా, మల్లారెడ్డి అయి నా వాళ్లనెవర్నీ చూడం. పిల్లల భవిష్యత్ చూస్తాం. అక్రమ నిర్మాణాలు చేసిన వాళ్లది తప్పు కావొచ్చు. పిల్లలు రోడ్డున పడతారు.

అకడమిక ఇయర్ డిస్టర్బ్ అయ్యిందనుకో పిల్లలు ఆగమైపోతారు. ఇలాంటి వారికి కొంత టైం ఇస్తాం. పబ్లిక్ యుటిలిటీ స్కూల్స్, కళాశాలలు వంటి విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తున్నాం. బూమ్‌రుఖ్ దవాళ్ చెరువు వద్ద పార్టీలకు అతీతంగానే చేశాం. ఇప్పటివరకూ చేపట్టిన కూల్చివేతలలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం తదితర అన్ని పార్టీలకు చెందిన వారున్నారు. నూటికి నూరు శాతం ఎఫ్‌టీఎల్‌లో ధర్మసత్రమైనా ఉండకూడదు. ఒకవేళ ధర్మసత్రం ఉన్నా కూల్చేస్తాం. హైడ్రా ఎలాంటి నోటీసులు ఇవ్వదు. హైడ్రా రాజకీయ చదరంగంలో పావు కాదల్చుకోలేదు. అందర్నీ ఒకలాగే చూస్తాం. రాజకీయపరమైన అంశాలకు ఎలాంటి తావులేదు.. అని ఆయన చెప్పారు.