పట్నం సునీతామహేందర్‌రెడ్డి
కూకట్‌పల్లి, జూలై 5: పదవిలో ఉన్నా లేకున్నా ప్రజల కోసమే తమ కుటుంబం పనిచేస్తుందని వికారాబాద్ జడ్పీ చైర్‌పర్సన్ పట్నం సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. జడ్పీ చైర్‌పర్సన్‌గా పదవీ విరమణ చేసిన సందర్భంగా కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఆమెను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సునీతా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. మల్కాజ్‌గిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తనకు ఓటు వేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రజలకు సేవలు అందించేందుకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటానని అన్నారు.