calender_icon.png 5 April, 2025 | 6:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎక్కడి దొంగలు... అక్కడే గప్‌చుప్!

05-04-2025 02:19:32 AM

ధాన్యం మిల్లర్ల దందా

నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో ‘సీఎంఆర్’ అక్రమాలు

  1. 60 మంది మిల్లర్ల చేతివాటం
  2. 404 కోట్ల విలువైన ధాన్యం మాయం
  3. సీఎంఆర్ రికవరీ అడిగితే చేతులెత్తేసిన అక్రమార్కులు
  4. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి
  5. తీరా.. పట్టుకోబోతే విదేశాలకు పరారైన కేటుగాళ్లు
  6. ఆర్‌ఆర్ యాక్ట్‌ను అస్త్రంగా ప్రయోగిస్తున్న సివిల్ సప్లు శాఖ
  7. ఆస్తుల జప్తుకు రంగం సిద్ధం

హైదరాబాద్, ఏప్రిల్ 4 (విజయక్రాంతి) : పేదల నోటికాడికి వెళ్లే బియ్యాన్ని ‘మిల్లర్’ పందికొక్కులు బొక్కేశాయి. ప్రభు త్వ ఖజానాకు గండికొట్టాయి. పొట్టబలగ తిని ఇప్పుడు చేతికి దొరక్కకుండా పరారయ్యాయి. ‘చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు..’ ఇప్పుడు యంత్రాంగం మేల్కొన్నది. మొద్దు నిద్ర వీడి పందికొక్కులను పట్టుకునే పనిలో పడ్డది. తిన్న ప్రతి గింజనూ కక్కించేందుకు సిద్ధమైంది.

నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో  కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) స్కాం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. రెండు జిల్లాలు కలిపి సుమారు 60 మంది మిల్లర్లు అక్రమ దందాకు తెరతీశారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ.404 కోట్ల విలువైన బియ్యాన్ని పక్కదారి పట్టించారు. రాష్ట్రాలు దాటించి సొమ్ము చేసుకున్నారు. ప్రభుత్వ ఖజానాకు గండికొట్టారు.

నిజామాబాద్ జిల్లాలో రూ.254 కోట్లు  స్వాహా..

నిజామాబాద్ జిల్లాలో మిల్లర్ల మాఫియా అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. ఏకంగా 48 మంది మిల్లర్లు రూ.254 కోట్ల విలువైన సీఎంఆర్‌ను పక్కదారి పట్టించి సొమ్ము చేసుకున్నారు. నిందితుల్లో ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు కూడా ఉండడం గమనార్హం. పౌర సరఫరాలశాఖ అధికారులు రంగంలోకి దిగి ఇప్పటికే పరారీలో ఉన్న మిల్లర్ల ఆస్తులను గుర్తిస్తున్నారు. మొత్తం 48 మందిపై రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఇప్పటివరకు రూ.4.56 కోట్ల సొమ్ము మాత్రమే రికవరీ చేయగలిగారు. 

మాజీ ఎమ్మెల్యే షకీల్ కాజేసిన సొమ్ము రూ.7 కోట్లు

పరారైన నిందితుల్లో బోధన మాజీ ఎమ్మెల్యే షకీల్ ఒకరు. ఈయన ఒక్కరే మూడు మిల్లలు నడుపుతున్నట్లు విచారణలో వెల్లడైంది. ఈయన సుమారు రూ.7 కోట్ల విలువైన సీఎంఆర్‌ను కాజేసినట్లు అధికారులు గుర్తించారు. నిందితుడిపై ఇప్పటికే లుక్‌అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. షకీల్‌తో పాటు మరో 47 మంది నిందితుల ఆచూకీ కోసం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

డిఫాల్టర్లకు చెందిన మిల్లలను సీజ్ చేశారు.ఆ మిల్లలను బ్లాక్ లిస్ట్‌లో చేర్చారు. పలు సెక్షన్లపై పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదు చేయించారు. నిందితులు తమ ఆస్తులను వేరే వ్యక్తులపై బదలాయించకుండా చూడాలని రిజిస్ట్రేషన్‌శాఖకు లేఖలు రాస్తున్నారు. 

అధికారుల చేతివాటం.. పలువురిపై కేసులు 

ప్రభుత్వం జీతం కాకుండా కొందరు అధికారులు అదనపు ఆదాయానికి కక్కుర్తి పడ్డారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ మిల్లర్‌కు కొంత మొత్తంలో ధాన్యం కేటాయించి, రికార్డుల్లో మాత్రం రెండింతల ధాన్యం కేటాయించినట్లు రికార్డుల్లో పేర్కొన్నారు. సదరు మిల్లర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో వెలుగు చూసింది.

వర్నికి చెందిన ఓ రైస్‌మిల్లర్‌కు 2022 23లో పౌరసరఫరాలశాఖ అధికారులు 19,640 కోట్ల క్వింటాళ్ల ధాన్యాన్ని కేటాయించారు. కొద్ది రోజుల తర్వాత మరికొంత ధాన్యం కేటాయిస్తామని యంత్రాంగం నుంచి సమాచారం అందింది. కానీ.. మిల్లుకు ధాన్యం చేరుకోలేదు. కొద్దిరోజుల తర్వాత తన మిల్లుకు 51 వేల క్వింటాళ్ల ధాన్యం కేటాయింపు జరిగిందని, అందుకు సంబంధించిన సీఎంఆర్ అప్పగించాలని సర్కార్ నుంచి నోటీసులు వచ్చాయి.

దీంతో సదరు మిల్లర్ హైకోర్టును ఆశ్రయించాడు. తన సంతకం ఫోర్జరీ చేసి మరీ అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. న్యాయస్థానం ఇటీవల ఈ కేసుపై స్పందిస్తూ.. అప్పటి డీఎస్వో చంద్రప్రకాశ్, తహసీల్దార్ నిఖిల్‌రాజ్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్‌పై కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. 

నిర్మల్ జిల్లాలో రూ.150 కోట్లు హాంఫట్..

నిర్మల్ జిల్లాలో 2020-24 వరకు పౌ రసరఫరాలశాఖ తొమ్మిది మిల్లర్లకు సుమా రు  రూ.150 కోట్ల ధాన్యాన్ని అప్పగించింది. సదరు మిల్లర్లు ధాన్యాన్ని పక్కదారి పట్టించారు. పొరుగు రాష్ట్రాలకు తరలించి సొ మ్ము చేసుకున్నారు. ప్రభుత్వానికి అప్పగించాల్సిన సీఎంఆర్‌ను ఎగవేసి పరార య్యారు. మరోవైపు పౌరసరఫరాలశాఖ అధికారులు నిందితులకు సంబంధించిన ఆస్తులను గుర్తించి, వాటిని జప్తు చేసే పనిలో నిమగ్నమయ్యారు. అలా ఇప్పటివరకు 20 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు.

ముగ్గురు అధికారులపై వేటు..

అక్రమాలను కట్టడం చేయడంలో విఫలమైన నాటి జిల్లా పౌరసరఫరాలశాఖ అధి కారి కిరణ్‌కుమార్‌తో పాటు డీఎం గోపాల్, నర్సాపూర్ (డి) మండలం ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ రమాదేవిని ఇటీవల రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

చక్రం తిప్పిన డీఎస్వో..

డీఎస్వో కిరణ్‌కుమార్‌కు సీఎంఆర్ అక్రమాలతో ప్రమేయం ఉన్నట్లు నాడు ఆరోప ణలొచ్చాయి. మిల్లుల సామర్థ్యానికి మించి ధాన్యం కట్టబెట్టాడని, అందుకు భారీ మొత్తంలో మిల్లర్ల నుంచి సొమ్ము చేసినట్లు మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. వాటి ఆధారంగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు రంగంలోకి దిగి వి చా రణ చేపట్టగా డీఎస్వోపై వచ్చిన ఆరోపణల న్నీ నిజమని తేలింది.

అంతకుముందు సదరు అధికారిపై మరో జిల్లాలో ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. ఎన్నోసార్లు ఉన్నతాధికారులు ఆయనపై వేటు వేశారు. అయి నప్పటికీ ఆయన పద్ధతి మార్చుకోలేదు. తనకున్న రాజకీయ  పలుకుడిని ఉప యోగిం చుకున్న తనకు నచ్చిన చోట పో స్టింగ్స్ తెచ్చుకుంటూ పబ్బం గడుపతున్నాడు.

సీఎంఆర్ రికవరీకి చర్యలు..

జిల్లాల్లో మిల్లర్లకు అప్పగించిన ధాన్యానికి సంబంధించిన సీఎంఆర్ రికవరీకి చర్యలు తీసుకుంటున్నాం. కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు ఆదేశాల మేరకు మిల్లర్లకు నోటీసులు ఇచ్చాం. రెవెన్యూ రికవరీ యాక్ట్‌ను ప్రయోగిస్తున్నాం. అక్రమార్కుల ఆస్తులను గుర్తించి, వాటిని జప్తు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నాం.

- శ్రీకాంత్‌రెడ్డి, 

సివిల్ సప్లుసై డీఎం, నిజామాబాద్