నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర..
బోడుప్పల్ లో 200 సిసి కెమెరాలను ప్రారంభించిన మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి.
మేడిపల్లి (విజయక్రాంతి): నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు ప్రత్యేక పాత్ర పోషిస్తాయని, నేరాలను కట్టడి చేయవచ్చని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర(MLA Chamakura Mallareddy) మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ నియోజకవర్గం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 23వ డివిజన్‌లో స్థానిక కార్పొరేటర్ రాసాల వెంకటేశ్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 200 సీసీ కెమెరాల ప్రారంభోత్సవంలో మాజీ మంత్రి, మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్(Medchal Constituency Congress Party In-charge Totakura Vajresh Yadav), మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, బోడుప్పల్ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ కలిసి పాల్గొని సీసీ కెమెరాలు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చామాకూర మల్లారెడ్డి మాట్లాడుతూ.. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని, ఒక సీసీ కెమెరా వంద మంది పోలీస్ సిబ్బందితో సమానమని, సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు నియంత్రిచవచ్చన్నారు. స్వీయ రక్షణ కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రజల రక్షణ కోసం సిసి కెమెరాలు ఏర్పాటు చేసిన కార్పొరేటర్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మార్కెట్ కమిటీ ఛైర్మెన్ బొమ్మలపల్లి నరసింహులు యాదవ్(Market Committee Chairman Bommalapalli Narasimhulu Yadav), కాంగ్రెస్ పార్టీ నాయకులు రాపోలు రాములు, డిప్యూటీ మేయర్ కొత్త స్రవంతి కిషోర్ గౌడ్, మేడిపల్లి ఇన్స్పెక్టర్ గోవింద్ రెడ్డి, మేడిపల్లి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ బాలస్వామి, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.