calender_icon.png 7 February, 2025 | 4:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తడి పొడి చెత్త సేకరణ ఎక్కడ?

07-02-2025 01:36:07 AM

* చెత్త బుట్టలు ఇతర అవసరాలకు వినియోగం 

* చెత్త సేకరణపై ప్రజలకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలం? 

వనపర్తి, ఫిబ్రవరి 6 ( విజయక్రాంతి ):  చెత్త బండి వచ్చింది అమ్మ తడి పొడి చెత్త ను వేరువేరుగా చేసి ఇవ్వండి అంటూ మున్సిపాలిటీ చెత్త సేకరణ కు ఉపయోగించే ట్రాక్టర్లు, మినీ ఆటో లకు ఉదయం వెళ్లలో మున్సిపాలిటీ పరిధిలో వినిపిస్తుంది. అది కేవలం ప్రచారం కోసమే తప్ప వాటిని ఆచరించడంలో చెత్త సేకరణకు వచ్చే సమ యంలో ప్రజలకు అవగహన కల్పించడం లో మున్సిపాలిటీ అధికారులు విఫలం అయ్యారని చెప్పవచ్చు.

తడి పొడి చెత్త ను వేరు వేరుగా చేసి ఇవ్వడం వల్ల సేంద్రియ ఎరువు తయారు చేయడానికి వీలుగా ఉం టుందని పలు సమావేశాల్లో అధికారులకు ఉన్నతాధికారులు వివరిస్తున్నారు తప్ప ము న్సిపాలిటీలో కింది స్థాయి సిబ్బంది మాత్రం ఆచరణలో తమకేమి పట్టనట్లుగా వ్యవహ రించడం పరిపాటిగా మారిందని చెప్ప వచ్చు. 

 మున్సిపాలిటీ అదాయానికి గండి 

మున్సిపాలిటీ పరిధిలో తడి పొడి చెత్త సేకరణ పై అధికారులు సిబ్బంది దృష్టి సారించకపోవడంతో మున్సిపాలిటీ ఆదా యానికి గండి పడటమే కాకుండా సేకరిం చిన చెత్త సైతం వృధా అవుతుంది. దాదాపు రెండున్నర సంవత్సరాల క్రితం తడి పొడి చెత్తను సేకరించేందుకు రూ 20 లక్షలతో వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని 16 వేల ఇండ్లకు ప్రతి ఇంటికి రెండు బుట్టల చొప్పున పంపిణీ చేశారు. 

ఈ బుట్టల వినియోగం పై పూర్తి స్థాయిలో అవగహన కల్పించక పోవ డంతో ఆ బుట్టలను సైతం ఇతర అవసరా లకు పట్టణ ప్రజలు వినియోగిస్తున్నారు. తడి చెత్తతో సేంద్రియ ఎరువు, పొడి చెత్త తో (గాజు సీసాలు, ఇనుప చువ్వలు వంటి వస్తు వులు) కార్మికులు  ఆదాయాన్ని పొందవ చ్చు. ఇందుకోసం మున్సిపాలిటీ పరిధిలో ప్రత్యేక వాహనాలు చెత్త డబ్బాలను సైతం ఏర్పాటు చేశారు.

అధికారుల పర్యవేక్షణ లేక పోవడంతో పూర్తిస్థాయిలో చెత్త సేకరించక పోవడంతో సేంద్రియ ఎరువు తయారీ ఆశించడం మేర జరగడంలేదని విమర్శలు సైతం ఉన్నాయి. డంపింగ్ యార్డ్ సైతం పూర్తి స్థాయిలో రూపుదిద్దుకపోవడంతో తడి పొడి చెత్త ఒకేచోట కుప్పలు కుప్పలుగా పారపొస్తున్నారు. చిత్తను ఇస్తానుసారంగా డంపు చేసినంత దుర్వాసన వస్తుందని కొన్ని నెలల కిందట నాగవరం ప్రజలు ఆందోళ నకు దిగిన సంఘటన సైతం ఉండగా, ఇటీ వల ఎమ్మెల్యే మేఘారెడ్డి సైతం వినతి పత్రా న్ని అందజేశారు.