06-02-2025 12:00:00 AM
సంగారెడ్డి, ఫిబ్రవరి 4 (విజయ క్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుంది. రైతులు పండించిన పంటలను మార్క్ ఫెడ్, వ్యవసాయ సహకార సంఘాలు, మార్కెట్ కమిటీల ద్వారా కొనుగోలు చేసేందుకు ఏర్పాటు చేసింది.
సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్, నారాయణఖేడ్ ప్రాంతంలో రైతులు కందులు అధికంగా సాగు చేస్తారు. కందులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం వ్యవసాయ సహకార సంఘాల ద్వారా కందులు కొనుగోలు చేసేందుకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో అధికారులు సహకార సంఘాల ద్వారా కందులు కొను గోలు చేసేందుకు జహీరాబాద్, నారాయణ ఖేడ్ ప్రాంతంలో ఏర్పాట్లు చేశారు.
రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరతో పాటు ఎలాంటి మోసం లేకుండా రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు అధికా రులు క్షేత్రస్థాయిలో కందుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన, ఎక్కడ కూడా కందులు కొనుగోలు చేయడం లేదు.
కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు, తప్ప రైతుల నుంచి కందులు తీసుకోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కందులకు మద్దతు ధర కల్పించింది. రూ.7550 క్వింటాలకు మద్దతు ధర కల్పించింది. ప్రభుత్వం మద్దతు ధర కల్పించడంతో రైతులు సంతోష పడ్డ, క్షేత్రస్థాయిలో రైతుల నుంచి కందులు కొనుగోలు చేయడం లేదు.
రాష్ట్ర ప్రభుత్వ మద్దతు ధర రూ.7550 క్వింటాల్‌కు...
రాష్ట్ర ప్రభుత్వం కంది రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ.7550 క్వింటాలకు మద్దతు ధర కల్పించింది. కందులు అధికంగా సాగు చేసే ప్రాంతాలలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ఆదేశాలు ఇచ్చింది. సంగారెడ్డి జిల్లాలో కందులు అధికంగా జహీరాబాద్, నారాయణఖేడ్ డివిజన్ లో సాగు చేస్తారు.
అక్కడ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. అధికారులు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ఇప్పటివరకు రైతుల నుంచి బస్తా కందులు తీసుకోలేదు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ఎందుకు తీసుకోవడం లేదని ఎవరైనా ప్రశ్నించిన రైతులు తీసుకురావడం లేదని సమాధానం చెబుతున్నారు.
ప్రభుత్వం మంచి ఆశయంతో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన అధికారుల నిర్లక్ష్యంతో రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదు. కొనుగోలు కేంద్రాలలో సిబ్బంది లేరని, సంచల కొరత ఉందని సాకులు చెబుతున్నట్టు తెలిసింది.
వ్యవసాయ మార్కెట్ యార్డు లో రూ.7300 క్వింటాలుకు
ప్రభుత్వం కందుల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన వాటిలో కందులు తీసుకోకపోవడంతో రైతులు వ్యవసాయ మార్కెట్ యార్డు లో కందులు తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో వ్యాపారులు, గ్రామాలలో మధ్య దళారులు రూ. 7300 క్వింటాలుకు ఇస్తున్నారు. రైతులు క్వింటాలుకు రూ. 200 వరకు నష్టపోతున్నారు.
ప్రభుత్వం ఎంతో మంచి ఆశయంతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారుల నిర్లక్ష్యంతో రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదు. క్వింటాలుకు ఒక్క రైతు 200 నష్టపోవడంతో, చిన్న సన్నకారు రైతులు పది క్వింటాళ్ల వరకు కందులు అమ్మకాలు చేస్తుంటారు. ఈ లెక్కన వారికి భారీగానే నష్టం జరుగుతుంది.
కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో కొన్ని గ్రామాలలో రైతులు మధ్య దళారులకు కందులు అమ్ముకుంటున్నారు. మధ్య దళారులు తేమ పేరుతో తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో ఆందోళన యుద్ధం చేస్తున్నారు.
ప్రభుత్వం కందుల సీజన్ ముగుస్తున్న, కొనుగోలు కేంద్రాలలో కందులు తీసుకోవడం లేదు. కొన్ని మార్కెట్ యార్డుల్లో వ్యాపారులు , అధికారులు కుమ్ముకై కొనుగోలు కేంద్రాలలో కందులు తీసుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. రైతులు కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర లభించకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారు.
కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన కందులు తీసుకోవడం లేదు
రాష్ట్ర ప్రభుత్వం కంది రైతులకు గిట్టు బాటు ధర కల్పించేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన, అధికారులు కోనుగోలు కేంద్రంలో కందులు తీసు కోవడం లేదు, కందులు అమ్ముకు నేందుకు కొనుగోలు కేంద్రానికి వస్తే అక్కడ ఎవరు ఉండడం లేదు.
అధికారు లకు ఫోన్ చేస్తే సంచులు లేవని, జిల్లా అధికారుల నుంచి అనుమతి రాలేదని సమాధానం చెబుతున్నారని చెప్పారు. ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారుల నిర్లక్ష్యంతో నష్టం జరుగు తుంది. కొనుగోలు కేంద్రాలు లేకపోవ డంతో మధ్య దళారులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది.
హన్మరెడ్డి, కరస్ గుత్తి రైతు
వ్యాపారులు చెప్పిన ధరకు కందులు అమ్ముకుంటున్నాం..
కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో వ్యాపారులు చెప్పిన ధరకు కందులు అమ్ముకుంటున్నాం. ప్రభుత్వం కొను గోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికా రులు అక్కడ కందులు తీసుకోవడం లేదు. దీంతో కందులను మధ్య దళా రులు, వ్యాపారులు చెప్పిన ధరకు అమ్ముకుని నష్టాలకు గురవుతున్నాం.
గిట్టుబాటు ధర లేకపోవడంతో నష్టం జరుగుతుంది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర రావడం లేదు. గ్రామాలలో వ్యాపారులు చెప్పిన ధరకు కందులు అమ్ముకుంటున్నాం.
ప్రల్లాద్, కారముంగి రైతు