calender_icon.png 31 March, 2025 | 1:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెనూ ఎక్కడ?

17-12-2024 01:30:24 AM

* గురుకుల హాస్టల్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

* మధ్యాహ్న భోజనంలో మెనూ పాటించకపోవడంపై ఆగ్రహం

* కేర్ టేకర్ సస్పెషన్.. ప్రిన్సిపాల్‌కు షోకాజ్ నోటీసు

జనగామ/యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 16 (విజయక్రాంతి): సరిగ్గా పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టే సమయానికి అనుకోకుండా ఎంట్రీ ఇచ్చిన కలెక్టర్ అక్కడి పరి స్థితిని చూసి సిబ్బందిపై గరమయ్యారు. మెనూ ఏంటీ.. మీరు పెట్టేది ఏంటి? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలు.. యాదా ద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్‌లో సోమవారం మధ్యాహ్న భోజనం పెట్టే సమయానికి కలెక్టర్ హనుమంతరావు ఆకస్మికం గా విజిట్ చేశారు.

విద్యార్థులు తింటున్న ఆహారాన్ని పరిశీలించిన కలెక్టర్.. ఈరోజు మెనూ ఏంటని అక్కడి సిబ్బందని ప్రశ్నించా రు. ‘మెనూ ఏదయ్యా... నువ్వు పిల్లలకు ఇచ్చే ది పెరుగా.. నీళ్లా.. ప్రభుత్వం 40శాతం మెస్ చార్జీలు పెంచింది మీరు తినడానికా?..’ అం టూ కేర్ టేకర్‌పై నిప్పులు చెరిగారు. మెనూ ప్రింట్ పాఠశాలలో ఉందని కేర్ టేకర్ సమాధానం చెప్పడంతో మరింత ఆగ్రహానికి గురై న కలెక్టర్.. తినేది ఒకచోట అయితే, మరోచోట మెనూ ఎలా పెడతారని ఆగ్రహం వ్య క్తం చేశారు. వెంటనే కేర్ టేకర్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

ప్రిన్సిపాల్‌కు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల గురుకులాలపై ప్రభు త్వం ప్రత్యేక దృష్టి పెట్టడం, ఈ మధ్యే మెస్ చార్జీలు పెంచిన వేళ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.