calender_icon.png 24 January, 2025 | 2:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లబ్ధిదారుల జాబితా ఎక్కడ....?

23-01-2025 10:36:36 PM

అధికారులు నిర్వహించిన సర్వేలు ఏమయ్యాయి నిలదీసిన గ్రామస్తులు...

నిజామాబాద్ (విజయక్రాంతి): ఇది గ్రామ సభనా లేక ఎన్నికల ప్రచార సభన అంటూ గ్రామస్తులు అధికారులను నిలదీసిన సంఘటన ధర్పల్లి గ్రామ సభలో జరిగింది. సర్వే చేసినప్పటికీని అధికారులు లబ్ధిదారుల జాబితా ఎందుకు ప్రకటించడం లేదని మాజీ సర్పంచ్ మిట్టపల్లి గంగారెడ్డి అధికారులను నిలదీశారు. గురువారం ధర్పల్లిలో జరిగిన గ్రామసభలో గ్రామ ప్రజల ప్రశ్నలతో అధికారులు వుక్కిరిబిక్కిరి అయ్యారు. అధికారులు నిర్వహించిన సర్వేలు ఏమయ్యాయి అని గ్రామస్తులు అంత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిలదీశారు. అర్హులైన లబ్ధిదారుల జాబితాకు బదులుగా దరఖాస్తుదారుల జాబితాను గ్రామ సభలో వెల్లడించడంపై గ్రామస్తులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. దరఖాస్తుదారుల్లో అనర్హులు ఉన్నప్పటికీని ఆర్థికంగా స్థిరంగా ఉన్న వారు దరఖాస్తు చేసుకున్నప్పటికిని వారి పేర్లు కూడా చదివారని అసలు లబ్ధిదారుల జాబితా ఎందుకు ప్రకటించడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

స్థానిక ఎన్నికల కోసమే ప్రచారంలో భాగంగా సభలు నిర్వహిస్తున్నారని ప్రజలు అధికారులతో గొడవకు దిగారు. ధర్పల్లి మండలంలో నిర్వహించిన గ్రామసభకు ఎంతో ఉత్సాహంగా గ్రామస్తులు తరలివచ్చారు. గ్రామసభలో ప్రజా పాలనలో పొందుపరిచిన అంశాలకై దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారికి 257 రేషన్ కార్డులు మంజూరైనట్లు ఇండ్ల నిర్మాణం కోసం 454 ఇండ్లు మంజూరి అయినట్లు ఆత్మీయ మహిళా భరోసా ద్వారా ఒక వంద 39 మంది లబ్ధిదారులకు మంజూరి అయిన అయినట్టు అధికారులు ప్రకటించారు. ఇదిలా ఉండగా దరఖాస్తు చేసుకున్న వారి అందరి పేర్లు ప్రకటించారని లబ్ధిదారుల పేర్లు ఎందుకు ప్రకటించడం లేదని గ్రామస్తులు ఆందోళన దిగారు. అధికారులు లబ్ధిదారుల పేర్లు ప్రకటించకుండా ఎందుకు గోప్యత పాటిస్తున్నారని గ్రామస్తులు అధికారులను ప్రశ్నించారు. లబ్ధిదారుల పేర్లు కాకుండా దరఖాస్తు చేసుకున్న వారందరి పేర్లు చదువుతున్నట్టు అధికారులు ప్రకటించడంతో నిజమైన లబ్ధిదారులకు నిరాశతో ఉండిపోయారు. 

సర్వేల పేరుతో గ్రామస్తులను తప్పుదోవ పట్టిస్తున్నారని అర్హులైన పేదవారిని వదిలి ఆర్థికంగా స్థిరత్వం గల వారికి భూములు ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకున్నారని అధికారులు లబ్ధిదారుల పేర్లు ప్రకటించకుండా దరఖాస్తు చేసిన అందరి పేర్లు ప్రకటించడంపై సభలో కలకలం మొదలైంది. అధికారులు సర్వేకు వచ్చినప్పుడు స్థానికంగా లేనివారు ఇతర పనులపై ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిన వారి పేర్లు సర్వేలో నమోదు చేయలేదని గడువు వ్యవధిలో సర్వే పూర్తి చేయాలన్న సాకుతో చాల కుటుంబాల వివరాలను సర్వేలో సేకరించలేదని గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. వెనుకబడిన తరగతులకు సంబంధించిన పూర్తి వివరాలు సర్వేలు లేకపోవడం వారికి అన్యాయం చేసినట్టు అవుతోందని అధికారులు ఎక్కువ శాతం అగ్రవర్ణాల వారికి లబ్ధి చేకూర్చేలా వ్యవహరిస్తున్నారని లబ్ధిదారుల జాబితాను అధికారులు తయారు చేసేటప్పుడు ప్రజాప్రతినిధుల జోక్యం తీవ్రంగా ఉందని గ్రామస్తులు వాపోతున్నారు.