calender_icon.png 28 November, 2024 | 4:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇచ్చిన హామీల అమలు ఎక్కడ?

28-11-2024 03:15:54 AM

  1. కేసీఆర్ లాగే సీఎం రేవంత్‌రెడ్డి కూడా..
  2. ఏడాది పాలనలో సాధించేదేమీ లేదు
  3. డిసెంబర్ 9న రుణమాఫీ అన్నారు మళ్లీ డిసెంబర్ 9 కూడా వస్తోంది
  4. డిసెంబర్ 1 నుంచి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతాం
  5. ఢిల్లీలో కేంద్రమంత్రి, టీ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి

హైదరాబాద్, నవంబర్ 27(విజయక్రాంతి): అప్రజాస్వామిక భాష మాట్లాడటా న్ని కేసీఆర్ ప్రవేశపెడితే.. రేవంత్‌రెడ్డి దాన్ని కొనసాగిస్తున్నారని కేంద్రమంత్రి, రాష్ట్ర బీజే పీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ పాలన పోయి కాంగ్రెస్ పాలన వచ్చినా ఏడాది పాలనలో సాధించిందేమీ లేదని స్పష్టం చేశారు.

బుధవారం ఢిల్లీలోని తన నివాసంలో కేంద్రమంత్రి మీడియాతో మా ట్లాడారు. రేవంత్ పాలనలో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పూర్తిగా దెబ్బతిన్నదని తెలిపారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అప్పులమీద ఆధారపడి ప్రభుత్వాన్ని నడిపి తే ఇప్పుడూ ఇదే పరిస్థితి కొనసాగుతోంద  న్నారు. చిన్నచిన్న పట్టణాలకు కూడా డెవలప్‌మెంట్ అథారిటీలను ఏర్పాటు చేసి.. డ బ్బులు వృథా చేస్తున్నారని విమర్శించారు.

రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఈ నెల 30న హైదరాబాద్‌లో విస్తృతస్థాయిలో చర్చించి, డిసెంబర్ 1 నుంచి 5 వరకు ప్రజల్లోకి వెళ్లి ఎండగడతామని స్పష్టం చేశారు. ‘కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలపై మాట్లాడితే సీఎం రేవంత్‌రెడ్డి వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారు.  కేసీఆర్ తరహాలోనే ఆయన వ్యవహరిస్తున్నా రు. మూసీ మీద ఆందోళన చేస్తే వ్యక్తిగతం గా మాట్లాడతారు తప్ప సమాధానమివ్వరు.

ఏడాదిలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చె ప్పండి. డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేస్తాం... 9న సోనియా జన్మదినం సందర్భం గా రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారు. డిసెంబర్ 9న పింఛన్లు పెంచుతామన్నారు. వందరోజుల్లో 6 గ్యారెంటీలు, ఏడాదిలో 420కి పైగా సబ్ గ్యారెంటీలు పూర్తిచేస్తామ ని చెప్పారు. ఏమైంది? ఇది పూర్తి వైఫల్యం కాదా’ అంటూ ఆయన మండిపడ్డారు.

నిరుద్యోగులు.. రాహుల్, రేవంత్ చెప్పిన మాట లు విని మోసపోయారని వాపోయారు. రైతు భరోసా, కౌలు రైతులకు, రైతు కూలీలకు ఇస్తామన్న డబ్బుల సంగతేందని ప్రశ్నించారు. మహిళలకు రూ.2,500, నిరుద్యోగ భృతి, ఎలక్ట్రిక్ స్కూటీ ఏమయ్యాయ ని ప్రశ్నించారు.

13 పంటలకు రూ.500 బోనస్ ఇస్తామని కనీసం వరికి కూడా ఇవ్వకుండా సన్నం, దొడ్డు అంటూ నిబంధనలు పెట్టడం దారుణమన్నారు. రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఇచ్చిన రేషన్‌కార్డులే ఇంకా నడుస్తున్నాయని.. ప్రత్యేక రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్కరికి కూడా రేషన్‌కార్డు ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు.

రాష్ట్రంలో సర్వం సమస్యలే...

మహిళలు, యువత, రైతులు, నిరుద్యోగు లు, విద్యారంగం ఇలా అన్ని రంగాల్లో సమస్యలు ఎక్కడికక్కడ పేరుకుపోయాయని కిష న్‌రెడ్డి అన్నారు. సమస్యలేవీ పరిష్కరించకుం డా విజయోత్సవాలు నిర్వహించడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు.. ‘బెదిరింపులు, తిట్ల పురాణాలు, వ్యక్తిగత దాడులు, అక్రమ కేసు లు, గాలిమాటలు తప్ప.. ఈ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ సాధించిందేమీ లేదు.

 నేను సమస్య గురించి మాట్లాడితే.. కిషన్‌రెడ్డి డీఎన్‌ఏ ఏంటి అని అడుగుతున్నారు. నా డీఎన్ ఏ బీజేపీ డీఎన్‌ఏ. మీలాగా పది పార్టీలు తిరిగిన డీఎన్‌ఏ కాదు’ అంటూ కేంద్రమంత్రి మండిపడ్డారు. నాలుగైదు నెలలుగా రెసిడెన్షియల్ స్కూళ్లలో చదివే విద్యార్థులు ఆందోళ న చేస్తున్నారని, విపక్షాలను తిట్టడం మీద పెట్టే దృష్టి పాలనమీద పెడితే విద్యార్థుల పరిస్థితి మెరుగవుతుందన్నారు. ఇటీవల ఆసి ఫాబాద్ జిల్లాకు చెందిన శైలజ అనే విద్యార్థి ఫుడ్ పాయిజన్‌తో చనిపోయిందని.. దీని మీద సీఎం కనీసం దృష్టిపెట్టలేదన్నారు.

రాజకీయ వ్యవస్థ భ్రష్టు పడుతోంది...

ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులు, వ్యక్తిగత దాడులు, అసాధ్యమైన అంశాల్లో ప్రజలను మభ్యపెట్టేలా చేయడంలో ఇద్దరూ ఇద్దరేనని కిషన్‌రెడ్డి అన్నారు. ‘నాడు కాంగ్రెస్ వాళ్లను బీఆర్‌ఎస్ వాళ్లను చేర్చుకుంటే, ఇప్పుడు బీ ఆర్‌ఎస్ వాళ్లను కాంగ్రెస్ వాళ్లు చేర్చుకున్నా రు. ఫిరాయింపులపై సకాలంలో స్పందించాలని కోరినా స్పీకర్ స్పందించడం లేదు.

ని స్సిగ్గుగా.. కాంగ్రెస్ టికెట్ మీద గెలిచినవారు బీఆర్‌ఎస్‌లో చేరి మంత్రులైతే, ఇప్పుడు కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పాలనలో మంత్రులయ్యారని ఎద్దేవా చేశారు. బీజేపీ రాష్ర్ట ప్రభుత్వాలను కూల్చే ప్రయత్నం ఏనా డూ చేయలేదని, చేయబోదని స్పష్టం చేశా రు.

రాష్ట్రంలో డిసెంబర్ నాటికి సంస్థాగత ఎన్నికలు పూర్తవుతాయని, ఆ తర్వాత పార్టీకి కొత్త అధ్యక్షుడి ఎన్నిక పూర్తవుతుందన్నారు. కర్ణాటకలో ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ అధికారంలోకి రావడం ఖా యమని, కాంగ్రెస్ పాలిస్తున్న 3 రాష్ట్రాల్లోనూ దయనీయమైన పరిస్థితులున్నాయని తెలిపారు.