calender_icon.png 8 November, 2024 | 7:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లోపం ఎక్కడ ఉంది?

10-07-2024 12:05:00 AM

ఉమ్మడి వరంగల్ జిల్లాలో యధేచ్చగా లింగ నిర్ధారణ పరీక్షలు గత కొన్నాళ్లుగా సాగుతుండడం బాధాకరం. కాసులకు కక్కుర్తి పడిన ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులు తమ కనుసన్నలలోనే ఈ రాకెట్ నడుపుతున్నుట్లు తెలుస్తున్నది. గతేడాది హన్మకొండ గోపాల్‌పూర్ పరిధిలో అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు వరంగల్ నిఘా, టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేసి పరికరాలను స్వాధీనం చేసుకుని భాగస్వాములైన వారిని అరెస్టు చేసి జైలుకు పంపారు.

తాజాగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు హన్మకొండలోని వివిధ ప్రాంతాల్లోని స్కానింగ్ సెంటర్‌ల మీద దాడి చేసి సూత్రధారులను పట్టుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నివారణ చర్యలు చేపడుతున్నా నిర్ధారణ పరీక్షలు ఆగడం లేదంటే లోపం ఎక్కడున్నట్టు? గర్భిణులను హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌ల ఆసుపత్రులకు పంపిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఈ చర్యలను నియంత్రించాల్సి ఉంది.

 -కామిడి సతీష్ రెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా