- మున్సిపాలిటీల్లో అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదుల వెల్లువ
- గడువులోగా పరిష్కరించని వైనం
- టీం సభ్యుల పనితీరుపై విమర్శలు
మెదక్, నవంబర్ 25 (విజయక్రాంతి): పట్టణాల్లో అక్రమ నిర్మాణాలను నియ్రంతించడానికి ప్రభుత్వం మున్సిపాలిటీల్లో ప్రత్యే కంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ టీంలను ఏర్పాటు చేసింది. టౌన్ ప్లానింగ్ విభాగానికి వచ్చే ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటిపై తగిన చర్యలు తీసుకోవడం ఈ టీం సభ్యుల కర్తవ్యం.
అయితే ఈ టీం సభ్యులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం చూపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో నెలల తరబడి ఫిర్యాదులు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ టీం ల పనితీరుపైవిమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఐదుశాఖల అధికారులకు చోటు..
ఎన్‌ఫోర్స్‌మెంట్ టీంలో రెవెన్యూ, పోలీ స్, నీటిపారుదల, ఆర్‌అండ్‌బీ, అగ్నిమాపక అధికారులు ఉంటారు. నిర్మాణ అనుమతుల కోసం మున్సిపల్ శాఖ నిర్వహిస్తున్న టీఎస్ వెబ్‌సైట్‌లో ఆక్రమణలపై ఫిర్యాదులు ఇవ్వడానికి పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ పోర్టల్ ద్వారా లేదా నేరుగా వచ్చే ఫిర్యాదులను టీం సభ్యులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను తొలగించే అధికారం టీంకు ఉంటుంది.
ఫిర్యాదుల పరిష్కారంపై నిర్లక్ష్యం.. మెదక్ జిల్లాలో.. మెదక్, రామాయం
పేట, తూప్రాన్, నర్సాపూర్‌లో మున్సిపాలిటీలు ఉన్నాయి. సెట్‌బ్యాక్ లేకపోవడం, అనుమతులు తీసుకోకుండా నిర్మాణాలు చేప ట్టడం,అనుమతులకు మించి అంతస్తులు నిర్మించడం వంటివి చేస్తున్నారు. ప్రతీ మున్సిపాలిటీలో ఇలాంటి వాటిపై పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నా యి. వీటిని 22 రోజుల్లోగా పరిశీలించి పరిష్కరించాలి. గడువులోపు ఫిర్యాదులను పరిష్కరించకుండా పెండింగ్‌లో పెడుతూ వస్తున్నారు.
రాజకీయ ఒత్తిళ్లతో వెనకంజ..!
ఫిర్యాదుల విషయంలో రాజకీయ ఒత్తిళ్లతో టీం సభ్యులు వెనుకంజ వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వారు తమ విధులు సక్రమంగా నిర్వర్తించేందుకు ప్రయత్నించినప్పటికీ రాజకీయ ఒత్తిళ్ల కారణంగా గమ్మునుంటున్నారు. వాస్తవానికి అక్రమ నిర్మాణాల వల్ల ప్రతీ మున్సిపాలిటీ పెద్దఎత్తున ఆదాయాన్ని కోల్పోతుంది.
దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ప్రత్యేకంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ టీంలను ఏర్పాటు చేసినప్పటికీ ప్రయోజనం కలగడం లేదనే అభిప్రా యం వ్యక్తమవుతోంది.ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని ఎన్‌ఫోర్స్‌మెంట్ టీంలు సక్రమంగా పనిచేసేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
ఫిర్యాదులను సత్వరం పరిష్కరిస్తాం
మెదక్ మున్సిపాలిటీకి కొత్తగా బదిలీపై వచ్చాను. ఎన్‌ఫోర్స్‌మెంట్ టీం జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో పనిచేయా ల్సి ఉంటుంది. టీం సభ్యులతో సమావే శం ఏర్పాటు చేసి తదుపరి కార్యాచరణ ప్రారంభిస్తాం. అనుమతులులేని నిర్మాణాలపై ఫిర్యాదులు వస్తే తక్షణమే స్పందించి చర్యలు తీసుకుంటాం.
శ్రీనివాస్‌రెడ్డి,
మున్సిపల్ కమిషనర్, మెదక్