* సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యపై కేటీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడిన ఎమ్మెల్యే అనిల్
ఆదిలాబాద్, డిసెంబర్ 28 (విజయక్రాంతి): చాయ్ తాగేలోపు సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి మాట ఎందుకు నిలుపుకోవడం లేదని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రశ్నించారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు కలెక్టరేట్ ఎదుట చేపట్టిన సమ్మె శనివారం 19వ రోజుకు చేరింది.
ఈ సందర్భంగా ఉద్యోగులు అర్ధ నగ్నంగా మోకాళ్లపై నిల్చొని నిరసన తెలిపారు. ఉద్యోగుల దీక్షా శిబిరాన్ని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సందరించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా సమ్మె చేస్తున్న ఉద్యోగుల కోరిక మేరకు దీక్ష శిబిరం నుంచి బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడి భరోసా కల్పించారు.