08-02-2025 01:16:30 AM
సీజ్ చేసిన వాహనాలకు జరిమానా విధించాలంటే హద్దులు ఉండాలంటున్న అటవీశాఖ
ప్రభుత్వ భూమికి టీపాన్ లేదు అటవీశాఖ చెప్పాలి: అర్బన్ తాసిల్దార్
మహబూబ్ నగర్, ఫిబ్రవరి 7 (విజయ క్రాంతి) : భూ పంచాయతీలు నాటి నుంచి నేటి వరకు ఎక్కడ చూసినా మా హద్దులు దాటారు... మా భూములు సబ్జా చేశారు.. మాది మాకు సర్వే చేసి హద్దులు నిర్ణయిం చండి.. అంటూ ప్రజలు ఎల్లప్పుడూ అధికా రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న విషయం అందరికీ తెలుసు.
ఈ సమస్యలు ఏ గ్రామం లో తలుపు తట్టిన ఈ సమస్యలు కుప్పలు కుప్పలుగా తేలుతాయి. ఈ సమస్య కేవలం ప్రజలకే కాదండి.. ప్రభుత్వ కార్యాలయాల పరిధిలో శాఖల భూములకు కూడా ఉంది. గుట్టలను... నేలను చేస్తున్నారని కథనం విజయ క్రాంతి దినపత్రిక శుక్రవారం రచయితం చేసింది.
ఈ విషయంపై అర్బన్ తాసిల్దార్ స్పందించి సమస్యను పరిష్కరిం చేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇది ఇలా ఉండగా ప్రజల సమస్యలు ఎలా గో కొన్ని పట్టించుకున్న కొన్ని పట్టించుకో కపోయినా ప్రజలు అధికారుల చుట్టూ ప్రద క్షిణలు చేస్తూనే ఉంటారు..
పరిష్కార రూపం దాల్చి వరకు ప్రయత్నం ఆపకుండా సమస్య లు ఉన్నవారు సతమతమవుతూనే ఉన్న దాఖలాలు లేకపోలేదు. కాగా మహబూబ్ నగర్ అర్బన్ మండల పరిధిలో అటవీశాఖ, రెవెన్యూ శాఖల పరిధిలో హద్దుల పంచా యతీ ఆరంభమైంది.
హద్దులు తేలేదేలా...
మహబూబ్‌నగర్ పట్టణంలోని వీరన్నపే ట్ ప్రాంతంలో ప్రభుత్వ భూమి అనగా రెవెన్యూ, అటవీ శాఖ పరిధిలో, వీరి మధ్య లో లావణ్య పట్టాదారులు ఉన్నారు. లావ ణ్య పట్టాదారులకు ఇచ్చిన భూములలో కొంతమేరకు ఎత్తు ప్రాంతాలు ఉన్నాయని కొంతమంది నేషనల్ హైవే 167 బైపాస్ రోడ్డు నిర్మాణంలో భాగంగా మట్టి తరలింపుకు సహకారం అందించడంతో చమతిగా కాంట్రాక్టర్ ఈదేచింగా ఎవరి అనుమతులు లేకుండానే మట్టిని తరలించా రు.
ఈ తరుణంలోనే అటవీశాఖ వారి దగ్గర ఉన్న మ్యాప్లను పరిగణలోకి తీసుకుంటూ అటవీ శాఖకు సంబంధించిన గుట్టను తవ్వడంతో గమనించి హిటాచి తో పాటు రెండు టిప్పర్లను సీజ్ చేశారు. ఇక్కడ వరకు బాగానే ఉన్నా అసలు సమస్య ఇక్కడే ఆరంభమైంది. సీజ్ చేసిన అటవీ శాఖ సంబంధిత వానాలకు నేటికి జరిమానా విధించలేదు.
ఎందుకు రెవెన్యూ శాఖ తమ హద్దును కేటాయించాలని, అప్పుడే సంబం ధిత సీజ్ చేసిన వాహనాలకు జరిమానా విధిస్తామని డీఎఫ్‌ఓ సత్యనారాయణ చెప్పా రు.
హద్దులకు, జరిమానకు సంబంధం ఏముంటుందో తెలియని పరిస్థితి నెలకొంది. హద్దులు ఎవరివైనా అక్రమంగా మట్టిని తరలించింది నిజమే కదా అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు. అక్రమంగా మట్టి తరలించిన వాహనాలను సీజ్ చేసి జరిమా నా విధించడంలో ఎందుకు తాత్పర్యం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొం దని పట్టణవాసులు అనేక సందేహాలను వ్యక్తం చేస్తుండ్రు.
అధికారులు చొరవ తీసుకోవాలి...
అటవీ శాఖ, రెవెన్యూ శాఖ ప్రభుత్వ శాఖల పరిధిలో ఉన్న భూములను హద్దులు ఏర్పాటు చేసుకోవడంలో మరో అడుగు ముందుకు వెయ్యవలసిన అవసరం ఎంతై నా ఉంది.
నెల రోజులు గడిచిన వీరన్నపేట్ డంపింగ్ యార్డ్ సమీపంలోని ప్రభుత్వ శాఖ ల పరిధిలో ఉన్న భూముల హద్దులు తేల డంలో ఆలస్యం కావడంతో రోజు రోజుకు అనేక సందేహాలకు తావనిస్తుంది. ఇకనైనా అధికారులు స్పందించి సంబంధిత సర్వే అధికారుల ద్వారా హద్దులను ఏర్పాటు చేసి సీజ్ చేసిన వాహనాలకు జరిగిన విధించవ లసిన అవసరం ఎంతైనా ఉంది.