04-09-2024 01:28:21 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): భారీ వర్షాలతో రాష్ట్రం అతలా కుతలం అవుతుంటే.. బాధ్యతగల ప్రతిపక్షనేత కేసీఆర్ ఎక్కడున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్ ప్రశ్నించారు. కష్టకాలంలో ప్రజలకు భరోసానివ్వాల్సిన మాజీ సీఎం ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యాంటూ విమర్మలు గుప్పించారు. మంగళవారం ఆయన గాంధీభవ న్‌లో పార్టీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి వరద బాధితులను ఆదుకోవడానికి అన్నీ విధాలుగా ప్రయత్నిస్తున్నారన్నారు. బీఆర్‌ఎస్ నేతలు బురద రాజకీయాలు మానుకోవాలన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో రాజ్‌భవన్ ముందు ఉన్న ఎంఎస్ మక్తా నీట మునిగినా కేసీఆర్ గడపదాటి బయటికి రాలేదన్నారు. ఏపీలో బాధ్యతగల ప్రతిపక్ష నేతగా జగన్ ప్రజలకు అండగా నిలబడ్డారని తెలిపారు.