calender_icon.png 24 October, 2024 | 11:46 AM

‘చారులత’ చూపులెటువైపో..

08-07-2024 12:05:00 AM

నాని కథానాయకుడిగా నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ప్రియాంక అరుల్ మోహన్. సుమారు నాలుగేళ్ళ తర్వాత వారిద్దరి కలయికలో వస్తున్న తాజా చిత్రం ‘సరిపోదా శనివారం’. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి ఆమె ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఆదివారం విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సినిమాలో చారులత అనే పోలీసు కానిస్టేబుల్ పాత్ర పోషిస్తున్న ప్రింయాక, రెండేళ్ళ తర్వాత ఓ తెలుగు సినిమాలో నటిస్తుండటం గమనార్హం.

మధ్యలో అనువాద చిత్రాల రూపేణ కనిపించిన ఆమె, ఈ అయిదారేళ్ళలో తెలుగులో నేరుగా చేస్తున్న మూడవ చిత్రమిది. పవన్ కల్యాణ్ ‘ఓజీ’లో నాయిక గా ఎంపికైనా.. ఆ సినిమా పనులు ఆలస్యం కావడం ఇందుకు ఓ కారణం కావ చ్చు. తాజాగా విడుదలైన ఫస్ట్‌లుక్‌లో చారడేసి కళ్ళతో భుజానికి సంచి తగిలించుకుని ఎటో చూస్తూ అడుగులు వేస్తున్నట్టు కనపడుతుంది ప్రియాంక. ఆమె చూపులెటువైపుకు పోతున్నాయో మీరూ ఓ చూపు చూడండి.