- ప్రస్తుతం నడుస్తున్న సీజన్ 2024-25
- దొరికినవి 2021-22 సీజన్ కొత్త గన్నీలు
- మంచిర్యాల జిల్లాలో ఏం జరుగుతోంది!
మంచిర్యాల, జనవరి 5 (విజయక్రాంతి): ప్రతి ఏడాది పౌర సరఫరాల శాఖ వరి ధాన్యం సేకరించేందుకు కొత్త గన్నీలను తెప్పిస్తుంటుంది. వ్యవసాయ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా ముందస్తు ఆర్డర్ పెట్టి జిల్లాకు తెప్పించి, కొనుగోలు కేంద్రాలకు 60 శాతం కొత్తవి, 40 శాతం పాత సంచులను పంపిస్తుంటుంది.
ఇలా ఏటా రెండు సీజన్ (వానాకాలం, యాసంగి)లకు ఉపయోగిస్తుంటారు. వ్యవసాయాధికారులు ఇచ్చిన అంచనా కంటే ధాన్యం తక్కువ వస్తే మిగిలిన గన్నీ సంచులను మరో సీజన్‌లో వాడుతుంటారు. అయితే ఈ నెల మూడవ తేదీన వడ్ల ధాన్యంతో వెళ్తున్న లారీని దండేపల్లి మండలం గూడెం చెక్‌పోస్టు వద్ద ఎన్‌ఫోర్సుమెంట్ అధికారులు పట్టుకుని, దండేపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఆ లారీలో సివిల్ సప్లు కొనుగోలు కేంద్రాలకు పంపించే 40 కిలోల గన్నీ బ్యాగులు లభించాయి. 70 కిలోల బరువు గల 295 బస్తాలు, వీటిపైన సీఎంఆర్‌కు ఇచ్చే మరో 2021 ఏడాదికి చెందిన 570 గన్నీ సంచులు ఎక్కడి నుంచి వచ్చాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మూడేండ్లుగా దందా?
మూడేండ్ల కిందట ధాన్యం తరలించేందుకు ఇచ్చిన గన్నీ బ్యాగులు పట్టుబడటంతో ఈ దందా దందా అప్పటి నుంచే కొనసాగుతున్నట్లు స్పష్టమవుతోంది. ఒక వేళ మిల్లర్ ఇచ్చినా.. వారికే ఆ సంవత్సరానికి సరిపడా సంచులుండవు. తిరిగి సివిల్ సప్లయ్ అధికారుల నుంచే తీసుకెళ్తుంటారు. మరి కొనుగోలు కేంద్రం వద్దకు మూడేండ్ల కిందటి బ్యాగులు ఎలా వచ్చాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
విచారణ చేపడుతున్నాం
2021-22 సీజన్‌కు సంబంధించి కొత్త గన్నీ సంచులు కొనుగోలు కేం నానికి ఎక్కడ నుంచి వచ్చా విషయంపై విచారణ చేపడుతున్నాం. ప్రస్తుతం 2023-24, 2024-25 సంవత్సరాలకు సంబంధించిన గన్నీ సంచులను కొనుగోలు కేంద్రాలకు పంపిస్తున్నాం. మిల్లర్ వద్ద కూడా 2021-22 ఏడాదికి సంబంధించి కొత్త సంచులు ఉండే అవకాశం లేదు. వీటిపై సమగ్ర విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.
బ్రహ్మారావు, సివిల్ సప్లు జిల్లా అధికారి, మంచిర్యాల