calender_icon.png 4 April, 2025 | 6:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికలు ఎప్పుడొచ్చినా 100 సీట్లు మనవే!

04-04-2025 01:23:35 AM

  1. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్
  2. కరీంనగర్, ఆదిలాబాద్ పార్టీ నేతలతో ప్రత్యేక సమావేశం

హైదరాబాద్, ఏప్రిల్ 3 (విజయక్రాంతి): అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడొచ్చి నా 100 సీట్లు మనవే. బీఫారం తీసుకున్న ప్రతిఒక్కరి గెలుపు ఖాయం’ అని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 27న పార్టీ రజతోత్సవ సభ జరగనున్న నేపథ్యంలో కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన నేతలతో గురువారం ఆయన ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ముందుగా మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ రచించి, ఆలపిం చిన పాటల లోగోను ఆవిష్కరించా రు. అనంతరం కేసీఆర్ మాట్లాడు తూ.. ఇటీవల ఓ సంస్థ రంగారెడ్డి, హైదరాబాద్ మినహా 90 నియోజకవర్గాల్లో ప్రత్యేక సర్వే చేయించిం దని, ఆ సర్వేలో బీఆర్‌ఎస్ 76 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని తేలిందని వెల్లడించారు.

ఒకటి రెం డు చోట్ల బీజేపీ గెలిచినా, బీఆర్‌ఎస్ ఆ సీట్లను లెక్కచేయాల్సిన అవసరంలేదన్నారు. బీఆర్‌ఎస్ నేతలు ప్రజల మధ్యే ఉండాలని, వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీలో మహిళల నాయకత్వాన్ని, యువత నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయాలని సూచించారు.