calender_icon.png 6 October, 2024 | 6:07 PM

తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు అయినా కెసిఆరే సీఎం అవుతారు

06-10-2024 03:52:53 PM

గజ్వేల్ (విజయక్రాంతి ): తెలంగాణ రాష్ట్రనికి ఎన్నికలు ఎప్పుడు జరిగినా కేసీఆరే సీఎం అవుతారని గజ్వేల్ మాజీ ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ అన్నారు . గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామానికి చెందిన శిగుళ్ల మల్లేశంకు 50000, కె వినోదకు 34500 రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మాదాసు శ్రీనివాస్ అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు ఒక వరం లాంటిదాని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమలు అమలు చేసి   స్వర్ణ యుగం తీసుకొచ్చిందని నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కానీ హామీలను  ప్రజలకు గుప్పించి అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతున్న ఇచ్చిన హామీలను విస్మరిస్తుందని విమర్శించారు.వెంటనే  ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అంటే కేసీఆర్ ,కేసీఆర్ అంటేనే తెలంగాణ అనే నానుడిని ఎవరు వేరు చేయలేరని అన్నారు. తెలంగాణ రాష్ట్రనికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేక అనుబంధం ఉందని తెలిపారు.

ఇటీవల చేసిన రుణమాఫీ తూతూ మంత్రంగా చేసిందని ఇంకా చాలా మంది రైతులు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్న పట్టనట్టు రేవంత్ ప్రభుత్వం ఉందని తెలిపారు. వెంటనే ప్రతి ఒక్కరికి లబ్ది చేకూరే విదంగా చర్యలు తీసుకోవాలని కోరారు.వానాకాలం పంటకు సంబంధించి ఇప్పటివరకు  రైతు బంధు నిధులు వేయలేదని వెంటనే రైతుల ఖాతాలలో జామచేయాలని డిమాండ్ చేశారు. రైతులకు పంట పెట్టుబడి సహాయం గురించి కాంగ్రెస్ నోరు మెదపడం లేదని అన్నారు. ప్రజా ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్నా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేస్తోందని దుయ్యబట్టారు.  ఈ సందర్భంగా సీఎంఆర్ఎఫ్  లబ్ధిదారుల కుటుంబీకులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మాజీ మంత్రి హరీష్ రావు గారికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో  రైతుబందు మాజీ మండల అధ్యక్షుడు మద్ది రాజిరెడ్డి, ప్యాక్స్ డైరెక్టర్ చడా శ్రీనివాస్ రెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్, మాజీ కో అప్షన్ అహ్మద్, గ్రామ పార్టీ అధ్యక్షుడు నిజామోద్దీన్, నాయకులు లబ్ధిదారుల కుటుంబాలు పాల్గొన్నారు..