ఆరు నెలల క్రితం నిర్మాణం పూర్తయినా ప్రారంభం కాని ఆధునిక వైద్యశాల
పటాన్ చెరు, ఫిబ్రవరి 3 : పటాన్‌చెరు నియోజకవర్గం జిన్నారం మండల కేంద్రం లో నిర్మించిన ఆధునిక వైద్యశాల ప్రారం భోత్సవానికి ఎదురుచూస్తోంది. ప్రస్తుతం జిన్నారంలో ఉన్న పీహెచ్సీ పక్కనే సుమారు రూ.1.50 కోట్లతో ఆధునిక వైద్యశాలకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి రెండు సంవత్సరాల క్రితం శంకుస్థాపన చేశారు.
ఆరు నెలల క్రితమే ఆసుపత్రి నిర్మాణం పూర్తయ్యింది. కానీ అప్పటినుంచి ఆసుప త్రి భవనం అలాగే ఉంది. ఆసుపత్రిని ప్రారంభించాలని కొన్ని రోజులుగా మండ ల ప్రజలు ప్రజాప్రతినిధులను కోరు తున్నారు.
శిథిలావస్థలో ప్రస్తుత ఆసుపత్రి భవనం..
ప్రస్తుతం వైద్యసేవలు అందిస్తున్న పీహెచ్సీ భవనం శిథిలావస్థకు చేరింది. ఇది సుమారు 30 సంవత్సరాల క్రితం నిర్మిం చింది కావడంతో స్లాబ్ పెచ్చులు ఊడు తున్నాయి. ఇతర సమస్యలు, వసతుల లేమితో ఆసుపత్రి సిబ్బంది, ప్రజలు ఇబ్బం దులు పడుతున్నారు. ప్రధానంగా మరుగు దొడ్లు, టాయిలెట్ల సమస్య నెలకొన్నది.
ఆసుపత్రికి వచ్చే ప్రజలతోపాటు ఉద్యోగు లు, సిబ్బంది కూడా ఇబ్బందులు పడుతు న్నారు. ఆసుపత్రి ఆవరణ కూడా అపరిశు భ్రతగా ఉంటుంది. ఆవరణలో పాములు తిరుగుతున్నాయి. ఆసుపత్రి క్వార్టర్స్ లో నివాసం ఉండే సిబ్బంది కూడా పాములు, తేళ్ళు ఇతర విషప్రాణులతో భయాం దోళనలకు గురవుతున్నారు.
నూతనంగా నిర్మించిన వైద్యశాల మాదిరిగానే ఆసుపత్రి సిబ్బంది నివాసం ఉండే క్వార్టర్స్ ను కూడా ఆధునీకరించాలని వినతులు వినిపిస్తు న్నాయి.
వైద్యసేవల కోసం పెరగనున్న జనాభా..
జిన్నారంలో నిర్మించిన నూతన వైద్య శాల ప్రారంభోత్సవం అయితే వైద్య సేవల కోసం చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే జనాభా పెరగనుంది. ఉమ్మడి జిన్నారం మండలంలో జిన్నారంతో పాటు బొల్లారం, గుమ్మడిదల కానుకుంట గ్రామాలలో పీహెచ్సీ సెంటర్లు ఉన్నాయి. ఐడీఏ బొల్లా రం మున్సిపాలిటీలో హైరిస్క్ సెంటర్ తో పాటు ఆధునిక వైద్యశాల అందుబాటులో ఉంది.
ఇటీవల జిన్నారంలో ఆధునిక వైద్య శాల నిర్మాణం కూడా పూర్తయింది. ఇది ప్రారంభోత్సవం జరిగితే గ్రామస్తులతో పాటు మంగంపేట, ఊట్ల, జంగంపేట, వావిలాల, కొడకంచి, నల్తూరు, రాళ్లకత్వ, శివనగర్, సోలక్ పల్లి, అండూరు, గడ్డపోతారం ప్రజలకు వైద్య సేవలు చేరువ అవుతాయి. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్ల లేని వారికి ఆధునిక వైద్యశాల వరంగా మారనుంది.