calender_icon.png 30 November, 2024 | 3:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ యూనివర్సిటీలకు వీసీలొచ్చేదెప్పుడు?

30-10-2024 02:21:53 AM

జేఎన్టీయూ, అంబేద్కర్, ఫైన్‌ఆర్ట్స్‌లను పెండింగ్‌లో పెట్టిన ప్రభుత్వం

హైదరాబాద్, అక్టోబర్ 29 (విజయక్రాంతి): విద్యాశాఖ పరిధిలో మొత్తం 12 యూనివర్సిటీలుండగా ౯ యూనివర్సిటీలకు వైస్ ఛాన్స్‌లర్లులను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అందులో తొలు త బాసర ట్రిపుల్ ఐటీ, కోఠి మహిళా యూనివర్సిటీలకు ఇన్‌చార్జీ వీసీలను నియమించిన ప్రభుత్వం.. ఈనెల 18న మరో ౭ యూనివర్సిటీలకు రెగ్యులర్ వీసీలను నియమించింది.

ఇంకా ౩ యూనివర్సిటీలకు వీసీలను నియమించకుండా పెండింగ్‌లోనే పెట్టింది. ఈ మూడింటిలో జేఎన్టీయూహెచ్, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలున్నాయి. ఇంతవరకూ జేఎన్టీయూ వీసీ పేరు ఖరారు కాలేదు. వీసీల ఎంపికకు సంబంధించి ఇటీవల జరిగిన సెర్చ్ కమిటీ సమావేశంలో ముగ్గురు పేర్లు ఒకే సామాజిక వర్గానికి చెందినవే వచ్చినట్లు తెలిసింది.

ఆ ముగ్గురు కూడా బలమైన సామాజికవర్గం నుంచే ఉండటం, అందులో ప్రభుత్వం సూచించిన పేరు లేకపోవడంతో జేఎన్టీయూ వీసీను ప్రకటించలేదు. అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ సెర్చ్ కమిటీ సోమవా రం సమావేశంకాగా, ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ సెర్చ్ కమిటీ సమావేశం వాయిదా పడుతూ వస్తోంది.

ఈ ౩ వర్సిటీల వీసీల పేర్లు ఖరా రు చేయడంలో ప్రభుత్వం సామాజిక సమీకరణాలకు సంబంధించి లెక్కలు వేసుకుం టున్నట్లు తెలిసింది. అందుకే ప్రక్రియ ఆలస్యమవుతోందని అధికారిక వర్గాలు పేర్కొ న్నాయి. త్వరలోనే ఈ మూడు వర్సిటీలకు వీసీలను ప్రకటించేందుకు ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది.

ఇదిలా ఉంటే ఈ ఏడాది మే 21తో వీసీల పదవీ కాలం ముగిసింది. మొత్తంగా ఐదు నెలలు ఆలస్యంగా తొమ్మిది యూనివర్సిటీలకు ప్రభుత్వం నూతన వీసీలను నియమించగా, మరో మూడింటికి నియమించాల్సి ఉంది. రెగ్యూలర్ వీసీలు లేక వర్సిటీట్లో పరిపాలన కుంటుపడిందని పలు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.