26-02-2025 12:00:00 AM
పీడీఎస్‌యూ రాష్ర్ట అధ్యక్షుడు ప్రదీప్
భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి ౨౫ (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తె నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి, అధికారం చేపట్టగానే దాని అమలు చేయడంలో చిత్తశుద్ధి చూపడం లేదని పి.వై.ఎల్ రాష్ర్ట అధ్యక్ష, కార్యదర్శులు కె. ఎస్ ప్రదీప్, వి. అజయ్ అన్నారు. తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం మార్క్స్ భవన్ లో పి వై ఎల్ రాష్ర్ట కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బి.ఆర్. ఎస్ ప్రభుత్వం అధికారంలో పదేళ్లు ఉన్నా, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వలేదు సరికదా కనీసం నిరుద్యోగ భృతి కూడా అమలు చేయలేదని అన్నారు. పి.వై.ఎల్ రాష్ర్ట ఉపాధ్యక్షులు ఈశ్వర్, సహాయ కార్యదర్శి రవి కుమార్, రాకేష్, సభ్యులు భరత్, కృష్ణ, దేవ, రామకృష్ణ, నవీన్, అనీస్, వినోద్ పాల్గొన్నారు.