calender_icon.png 14 November, 2024 | 6:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం ఇంకెప్పుడు కొంటరు?

14-11-2024 12:41:07 AM

కామారెడ్డి జిల్లా కల్లూర్ గ్రామంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న రైతులు 

  1. కొనుగోళ్లలో జాప్యంపై రైతుల ఆందోళన
  2. ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే జాప్యమని మండిపాటు

కామారెడ్డి, నవంబర్ 13 (విజయక్రాంతి): ధాన్యం కొనుగోళ్లులో జాప్యంపై కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని పోతంగల్ మండలం కల్లూర్‌లో బుధ వారం రైతులు ఆందోళన చేపట్టారు. ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించి వారం రోజులు అవుతున్నా కాంటా పెట్టడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

వెంటనే కాం టాలను ప్రారంభించాలని డిమాండ్ చేశా రు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతుందని ఆరోపిం చారు. ఇప్పటికైనా అధికారులు కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యానికి కాంటా పెట్టాలని డిమాండ్ చేశారు. 

సన్నరకం వడ్లను కొనాలి

నెలలు గడుస్తున్నా సన్నరకం ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని రైతులు బుధవారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం ఆజామాబాద్, అన్నాసాగర్ గ్రామంలో ఆందోళన చేశా రు. సన్నరకం ధాన్యం కొనకుంటే పురుగుల మందు తాగి చస్తామని ఆవేదన వ్యక్తం చేశారు. సొసైటీ అధికారులకు విన్నవించినా పట్టించుకోకపోవడంతో రైతులు సొసైటీని ముట్డడించారు. 

రామాయంపేట మండలంలో

రామాయంపేట, నవంబర్ 13: ధా న్యం కొనుగోలు చేయాలని మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సిలింగాపూర్, తొనిగండ్ల గ్రామాల రైతులు బు ధవారం మెదక్ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి నెలరోజులు గడుస్తున్నా కేవలం నాలుగు లారీల ధాన్యం మాత్రమే తీసుకెళ్లారని వారు తెలిపారు. మార్కెట్ యార్డు అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోతుందని మండిపడ్డారు. వెంటనే అధికారులు కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. 

పత్తి రైతుల ధర్నా 

ఖమ్మం, నవంబర్ 13 (విజయక్రాంతి): సీసీఐ నిబంధనలు సడలించి, పత్తి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ బుధవారం తిరుమలాయపాలెం మండలంలోని గోల్తాండ భాగ్యలక్ష్మీ జిన్నింగ్ మిల్లు ఎదుట అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేశారు. ఈ సందర్భం గా రైతు సంఘం నాయకులు మాట్లాడు తూ.. గిట్టుబాటు ధర గురించి అడుగుతు న్నా పాలకులకు పట్టడం లేదన్నారు. ఈ విషయమై మంత్రులు ఇచ్చిన హామీలు కూడా అమలు కావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. 

ధాన్యం తరలింపులో సమస్యలు ఉండొద్దు

మంత్రి పొన్నం ప్రభాకర్ 

హైదరాబాద్, నవంబర్ 13 (విజయక్రాంతి): కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని తరలించే ప్రక్రియలో ట్రాన్స్‌పోర్ట్ సమస్యలు లేకుండా చూడాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రవాణా శాఖకు సంబంధించిన లారీలు, ఇతర వాహనాల కొరత లేకుండా జిల్లా రవాణా అధికారులు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో సమన్వయం చేసుకోవాలని రవాణా శాఖ ప్రత్యేక కార్యదర్శి వికాస్‌రాజ్‌ను మంత్రి ఆదేశించారు.

బుధవారం సచివాలయంలో ఆయన అధికారులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద వాహనాల కొరత లేకుండా తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. కలెక్టర్లు, రవాణా శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని మంత్రి సూచించారు. ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు.