09-04-2025 12:29:26 AM
ఖాళీ స్థలంలో పంట... అకాల వర్షాలతో తంటా...
పంట నిల్వకు రైతుల ఇబ్బందులు
త్వరలో కొనుగోళ్లు ప్రారంభిస్తామన్న కలెక్టర్
ఆదిలాబాద్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): ఆరుగాలం కష్టపడి అప్పోసోప్పో చేసి పం డించిన పంటను అమ్ముకునేందుకు సైతం రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. రబీ లో సాగుచేసిన జొన్న పంట చేతికి వచ్చినా ప్రభుత్వం ఇంకా పంట కొనుగోళ్ళు ప్రారంభించకపోవడంతో రైతులు ఆందోళన చెం దుతున్నారు. కోతకు వచ్చిన పంటను నిలు వ చేసుకునేందుకు సరిపడా స్థలాలు లేక ఎక్కడ నిల్వ చేయాలో ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని రోజులుగా అకాల వర్షా లు కురియడంతో పంట ఎక్కడ వర్షార్పణం అవుతోందోనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తలమడుగు మండలం కజ్జర్ల గ్రామంలో చేతికొచ్చిన జోన్న పంటను నిల్వ చేసుకునేందుకు రైతులు ఇబ్బంది పడుతున్నారు.
పంట నిల్వ కు సరియైన స్థలాలు లేక గ్రామంలో ఓ కాళీ స్థలంలో పంట ను ఎండబెడుతున్నారు. ఈ సంవత్సరం పరిస్థితులు అనుకూలించడంతో రబీలో జోరుగా జొన్న పంటను సాగు చేశారు. జిల్లా వ్యాప్తంగా లక్ష ఎకరాల్లో జొన్న పంట సాగు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. పంట సాగుచేసిన రైతుల వివరాలను ఎప్పటి కప్పుడు ఆన్లైన్ లో పొందుపరచడం జరిగింది. కాగా వారం రోజుల నుంచి రైతులు చేతికొచ్చిన జొన్న పంటను తమ తమ ఇండ్లలోకి తెచ్చుకుంటున్నారు. ఎక్కువ మొత్తంలో జొన్న దిగుబడి రావడంతో పంటను ఇంటి వద్ద నిల్వ ఉంచుకోలేక పోతున్నామని త్వరలో కొనుగోలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
ప్రభుత్వం జొన్న పంటకు రూ. 3,300 మద్దతు ధర ప్రకటించడంతో ఎక్కువ శాతం రైతులు జొన్నపంట సాగుపైనే దృష్టి సారించారు. దీనికి తోడు ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్‌ను అందించడంతో మరింత జొన్న సాగుకు రైతులు ముందుకువచ్చారు. కాగా కొంతమంది రైతుల పొలాల్లో భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో సాగునీరు అందక ఎంతమంది రైతుల పంటలు ఎండిపోయి, పంట సాగుకు పెట్టిన పెట్టుబడి కూడా వస్తుందోరాదో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది రైతులకు సాగు నీరు పుష్కలంగా ఉండడంతో ఎకరానికి 15 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ప్రభుత్వ నిబంధనలు సడలించి ఎకరానికి 20 క్వింటాళ్ల కొనుగోలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. ఇటీవల మండలానికి చెందిన కొంత రైతులు జొన్నల కొనుగోణ నిబంధనలు సకలించి ఎకరానికి 20 క్వింళ్ల కొనుగోలు చేయాలని జిల్లా కరెక్టర్ ను కలిసి విన్నవించారు.
త్వరలో పంట కొనుగోలు చేపడతాం: కలెక్టర్
జిల్లాలో రైతులు సాగుచేసిన జొన్న పంటను ప్రభుత్వ ఆదేశాలతో త్వరలో కొనుగోలు చేస్తాం అని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. తలమడుగు మం డలం ఖోడద్ గ్రామంలోని రైతు పొలం లో జొన్న పంట కోత ను కలెక్టర్ మంగళవారం స్వయంగా పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా ఈసారి లక్ష ఎకరాల్లో జొన్న పంట సాగు చేయడం జరిగిందన్నారు. త్వరలో కొనుగోలను ప్రారంభిస్తామని రైతులు ఆందోళన చెందవద్దన్నారు.
కొనుగోలులను ప్రారంభించాలి
రబీ సీజన్‌లో సాగుచేసిన జొన్న పంటను త్వరలో ప్రభుత్వం కొనుగోలు చేపట్టాలి. చేతికి వచ్చిన పం టను నిల్వ ఉంచేందుకు స్థలాలు లేక గ్రామంలోని ఖాళీ స్థలాల్లో నిల్వ ఉంచుతున్నాం. కానీ కొన్ని రోజులుగా కురు స్తున్న అకాల వర్షాలతో ఎక్కడ తమ పం ట నష్ట పోవాల్సి వస్తుందో తెలియడం లేదు. కావున ప్రభుత్వం వెంటనే జొన్న పంట కొనుగోలను ప్రారంభించాలి.
- కాటిపెల్లి వెంకటరెడ్డి, రైతు తలమడుగు