అనంతగిరి, (విజయ క్రాంతి): ఏండ్లుగా నిలిచిన పనులు కాంగ్రెస్ ప్రభుత్వం పైనే ఆశలు అనంతగిరి మండల కేంద్రంలో ప్రాథమిక పాఠశాల ఏళ్లు గడిసిపోతున్నా ఇప్పటివరకు పాఠశాల భవనం పూర్తి కాకపోవడం విమర్శలకు తావిస్తోంది. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దీన్ని నిర్మాణం చేపట్టగా వివిధ కారణాలతో పనులు చివరి దశలో ఆగిపోయాయి. తరువాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దీని గురించి పట్టించుకోలేదు ఈ పాఠశాల మరోపక్క నడుపుతున్న సాంఘిక సంక్షేమ హాస్టల్ కూడా కొంత దూరంలో ఉండడంతో విధులు నిర్వహించేందుకు ఇబ్బందికరంగా ఉందని అధికారులు విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నూతన పాఠశాల భవనం నిర్వహించేందుకు బిఆర్ఎస్ హయాంలో శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత కొంతవరకు పనులు జరిగాయి చివరి దశకు చేరిన తర్వాత గుత్తేదారులకు ఒక్క రూపాయి కూడా నిధులు విడుదలలో జాప్యంతో పనులుఆగిపోయాయ త్వరలో భావన నిర్మాణం చేపట్టే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఈ సమస్య పరిష్కారం అవుతుందని మండల ప్రజలు విద్యాధికారులు గుత్తేదారు వారంతా ఆశ పెట్టుకున్నారు.