23-03-2025 12:56:55 AM
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు
హైదరాబాద్, మార్చి 22 (విజయక్రాంతి): ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికుల విలీనం, వారికి పీఆర్‌ఎసీ వర్తింపు, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గుర్తింపు, యూనియన్ల పునరుద్ధరణ తదితర హామీలలో ఏ ఒక్కటీ అమలు చేయలేదని హరీశ్‌రావు పే ర్కొన్నారు. వీటిని ఎప్పటి వరకు అమలు చేస్తారని ఆయన ప్రశ్నించారు.
తాము ఆర్టీసీ కార్మికులను రెగ్యులర్ ఉద్యోగులుగా మార్చే ప్రయత్నం చేసినా, గవర్నర్ వద్ద ఫైల్ పెండింగ్‌లో ఉండటం వల్ల చేయలేకపోయామన్నారు. ఆర్టీసీలో చనిపోయిన కార్మికుల పిల్లలకు కారుణ్య నియామకాలు చేపట్టామని.. వారిని మూడేళ్లుగా వెట్టి చాకిరీ చే యిస్తున్నారన్నారు. ఆధునికీకరణ పేరుతో ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టి, వారికి డిపోలు వారికి అప్పగిస్తున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు.
‘మహాలక్ష్మికింద ప్రతినెలా ఎంత చెల్లించాలి. ఇప్పటివరకు ఎంత చె ల్లించారు. ఎంత బకాయి ఉందో స్పష్టంగా చెప్పం డి. నెక్లెస్ రోడ్డులో కార్మికులకు చెక్కులు పం పిణీ చేశారు. ఇప్పటి రకు అది మంజూరు కాలేదు. కార్మికులకు న్యాయం చేయండి. నిబంధనల మేరకు ఆర్టీసీ కార్మికులు 8 గంటలే పనిచేయాల్సి ఉంటే వారితో 16 గం టలు పనిచేయిస్తున్నారు.
విద్యార్థులు ఫుట్ బోర్డు ప్రయాణాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. అందుకే కొత్త బస్సుల సంఖ్య పెంచాలి. నగరంలో కాలుష్య కారకమైన వాహనాలు బాగా పెరిగాయి. కాలుష్యాన్ని త గ్గించేందుకు వా టిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు. మంత్రులు లేకుండా
సభ నడపడమెందుకు?
అసెంబ్లీ సాయంత్రం సెషన్స్‌లో సభ్యు లు మాట్లాడుతుంటే కనీసం సమాధానం చెప్పేందుకు కూడా మంత్రులు అందుబాటులో లేరని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అసెంబ్లీలో పేర్కొన్నారు. మంత్రులతో పా టు కార్యదర్శులు, అధికారులు కూడా అం దుబాటులో లేకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని వాపోయారు. ఈ మేరకు ఆయన పా యింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. ఇలాగైతే స భ నడపటం దేనికని ప్రశ్నించారు.
గుట్టలకు రైతుబంధు ఇస్తే రికవరీ చేయండి!
బీఆర్‌ఎస్ హయాంలో గుట్టలు, పుట్టలకు రైతుబంధు ఇచ్చారంటూ తమపై కాం గ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారని, అలాంటివి ఏమైనా ఉంటే రికవరీ చేయండని హరీశ్‌రావు ప్రభుత్వాన్ని సూచించారు. రాష్ట్రంలో ఉన్న కోటి రెండు లక్షల ఉపాధి హామీ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. శనివారం అసెంబ్లీలో బడ్జెట్‌పై జరిగిన చర్చలో భాగంగా మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలపై హరీశ్‌రావు స్పం దించారు.
‘గత బడ్జెట్లో రైతు భరోసాకు రూ. 930 కోట్లు పెట్టారు.. ఈ ఏడాది బడ్జెట్లో రూ.600 కోట్లు కేటాయించారు. ఈ బడ్జెట్లో ఏకంగా రైతు భరోసాకు రూ.330 కోట్లు కో త పెట్టారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో ఇచ్చేది.. రూ.12 వేలు, దళితులు, గిరిజనులు, బలహీనవర్గాల్లో 10 గుంటల వారసత్వ భూమి కూడా ఉంది. అంటే వారికి ఇచ్చేది రూ.3 వేలేనా? అనేది క్లారిటీ ఇవ్వాలి’ అని కోరారు.
బకాయిలు రాక కాలేజీలు ఆగమైతున్నయ్
రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించక రాష్ర్టంలో జూనియర్, డిగ్రీ కాలేజీలు ఆగమయ్యే పరిస్థితి ఏర్పడిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం రీయింబర్స్‌మెంట్ బకాయిల చర్చపై హరీశ్ మాట్లాడారు. బీఆర్‌ఎస్ హయాంలో రీయింబర్స్‌మెంట్ ఇవ్వలేదనడం సత్యదూరమని, పెద్ద నోట్ల రద్దు, కరోనా లాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పటికీ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో రూ.20వేల కోట్ల మేర బకాయిలు చెల్లించినట్లు తెలిపారు.
2014--15లో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 2 వేల కోట్ల రీయింబర్స్‌మెంట్ బకాయిలను తమకు అప్పగించిందని, వాటిని బీఆర్‌ఎస్ చెల్లించిందని గుర్తు చేశారు. మంత్రి సీతక్క రూ.800 కోట్ల బకాయిలు చెల్లించామని చెప్పారని, కానీ ఆ నిధులు కేంద్ర ప్రభుత్వం ఎస్సీ,ఎస్టీ కాంపొనెంట్ కింద వచ్చినవేనన్నారు.
ఆర్టీసీ విలీనంపై కమిటీని మరోసారి సమావేశపరుస్తాం
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
ఆర్టీసీ విలీనంపై ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసిందని, ఆ కమిటీని మరోసారి సమావేశపర్చి దానికి సంబంధించిన కార్యాచరణ వెల్లడిస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. శనివారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులతో ఓవర్ టైమ్ పనిచేయించడం లేదని..
ఒకవేళ అదనపు గంటలు పనిచేస్తే మరుసటి రోజు సెలవు ఇస్తున్నామన్నారు. కారుణ్య నియమాకాలు గత ప్రభుత్వ విధానాల ప్రకారమే చేస్తున్నామని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల కోసం యాప్ తీసుకొస్తామన్నారు. నగరంలో కొత్తగా డీజిల్, పెట్రోల్ ఆ టోలను అనుమతించడం లేదన్నారు.