calender_icon.png 4 April, 2025 | 4:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రహదారి బాధితులకు ఇండ్లెప్పుడు

28-03-2025 12:58:25 AM

ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎర్రం భగవంతు

పెబ్బేరు మార్చి 27: రోడ్డు విస్తరణ లో లక్షల్లో విలువ చేసే ఇండ్లను కోల్పోయి కిరాయి ఇండ్లలో నివసిస్తున్న వారికి ఇంకెప్పుడు ఇండ్లను ఇస్తారని గురువారం ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎర్రం భగవంతు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం లో వనపర్తి రహదారి విస్తరణ కార్యక్రమం చేపట్టింది. బాధితులకు విలువైన స్థలంలో ఇంటి స్థలంతో పాటు ప్రభుత్వం నుంచి డబుల్ బెడ్ రూమ్ లు కట్టిస్తామని గత మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హామీలు ఇచ్చారు.

కానీ అవి హామీలుగానే మిగిలాయని అరోపించారు. యాభై మంది పాత్రికేయులు గా చలామణి అవుతున్న వారికి జూరాల ఎడమ కాలువ పక్కన ప్లాట్ లు ఇవ్వటమే కాకుండా వారికి డబుల్ బెడ్ రూమ్ లు ఇచ్చారు. అందులో గతంలో బీసి కాలనీలో ప్లాట్ లు తీసుకొని ఇందిరమ్మ ఇంటి బిల్లులతో ఇండ్లను నిర్మించుకున్న వారికి గూడా గత మాజీ మంత్రి ఇండ్లను కెటాయించారు.

కానీ విస్తరణ బాధితులకు మాత్రం ఇసుమంతైనా న్యాయం చేయలేదని ఆరోపించారు. ఇప్పటి ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే చొరవతీసుకుని బాధితులకు సత్వరమే ఇంటి స్థలం తో పాటు డబుల్ బెడ్ రూమ్ కోసం గృహలక్ష్మి పథకం ద్వారా ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు రాములు తదితరులు పాల్గొన్నారు.