30-04-2025 12:16:15 AM
అధ్వానంగా మారిన పెద్ద అంబర్‌పేట్ టూ తొర్రూర్ రహదారి
100 ఫీట్ల రోడ్డు మంజూరైనా ముందుకు సాగని పనులు
ప్రాణాలు పొతున్నా పట్టించుకోని అధికారులు
అబ్దుల్లాపూర్‌మెట్, ఏప్రిల్ 29 : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల పరి ధిలో పలు గ్రామాలకు వెళ్లే రహదారులు అధ్వానంగా మారాయి. దీంతో అటుగా వెళ్లే వాహనదారులు నరకయాత అనుభవిస్తున్నారు. ఈ రోడ్లు ప్రస్తుతం 15 ఫీట్ల విస్తీర్ణం తో మాత్రమే ఉన్నాయి. పెద్ద అంబర్ పేట్ నుంచి తొర్రూర్ వెళ్లే రోడ్డు గుంతలు, గుంతలుగా ఏర్పడి గ్రామస్తులు తీవ్ర ఇబ్బుం దులు ఎదుర్కొంటున్నారు. అదే విధంగా ఈ రోడ్డు 100 ఫీట్లకు మంజూరు అయ్యింది కానీ.. పనులు మాత్రం ముందుకు సాగడంలేదు.ఈ రోడ్ల విస్తరణకు మోక్షమెప్పుడు కల్పిస్తారోనని అటుగా వెళ్లే ప్రయాణికులు ఎదుర్చుడాల్సిన దుస్థితి ఏర్పడింది.
ము న్ముందు వచ్చేది వర్షాకాలంలో కావడంతో వర్షాలు ప్రారంభం అవ్వకముందే రోడ్డు పనులను పూర్తి చేయాలని కోరుతున్నారు. లేని ఏడాల వానలు పడుతుంటే రోడ్డు విస్తరణ పనులు ముందుకు సాగావని తాము ఇంకా ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. మస్జిద్ పూర్ నుండి పీర్లగూడెం వెళ్ళే రోడ్డు కంకర తేలి అటుగా వెళ్లాలంటేనే ఆ గ్రామస్థులు జంకుతున్నారు. కుంట్లూరు నర్సరీ నుంచి కుత్బుల్లాపూర్ వెళ్లే రోడ్డు మార్గంలో 12 ఫీట్లే ఉంటుంది. ఈ రోడ్డు మార్గంలో పలు గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటా రు. దీంతో ఈ రహదారిలో ఎక్కువ ప్రమాదాలు జరుగుతుంటాయి. ప్రాణాలు కోల్పో యిన సంఘటలు చాలనే ఉంటాయని గ్రామస్తులు వాపోయారు.
ప్రమాదకరంగా మారిన కుత్బుల్లాపూర్ రోడ్డు
కుంట్లూరు నర్సరీ నుంచి కుత్బుల్లాపూర్ వెళ్లే రోడ్డు మార్గం చాలా ప్రమాదకరంగా మారిందని గ్రామస్తులు వివరించారు. ఈ రోడ్డు మొత్తం 12 ఫీట్లే. ఈ రహదారి నుంచి ప్రతి రోజు పదుల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటారు. దీంతో ఎక్కువగా ప్రమాదల భారీన పడి.. ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చాలానే ఉన్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. కుత్బుల్లాపూర్, తిమ్మాయిగూడ, గౌరెల్లి గ్రామాలకు చెందిన రైతులు పశుగ్రాసం (గడ్డి) పెంపకం చేస్తుంటారు. ఆ గడ్డిని నగరానికి తలించే ఈ రోడ్డు మార్గం ఇదే.
అలాగే పాల వ్యాపారం కూడా చేస్తుంటారు. పాలను నగరంలో పలు ప్రాంతాలకు విక్రయిస్తుంటారు. రాకపోకలు సాగించే క్ర మంలో రోడ్డు ఇరుకుగా ఉండడం వలన చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని పా ల వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు ఇతరులకు సమాచారం ఇవ్వలనుకుంటే ఆ ప్రాంతంలో మొబైల్ నెట్‌వర్క్ కూడా పనిచేయవన్నారు.. పలు పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు ఎన్నికలు వచ్చినప్పుడల్లా... ఓట్ల కోసం హామీలు ఇచ్చి.. ఎన్నికలు పూర్తి అయ్యక చేతులు దులుపుకుంటున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోడ్ల విస్తరణ చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరుతున్నామన్నారు.
సిగ్నల్స్ రాక మొబైల్స్ పనిచేయవు..
కుత్బుల్లాపూర్ రోడ్డు మార్గం ఎక్కువ మూల మలుపు ఉంటాయి. కుంట్లూరు నర్సరీ నుంచి కుత్బుల్లాపూర్ వరకు ఫారెస్టు ఏరియా ఉంటుంది. ఈ మార్గమధ్యలో ప్ర మాదాలకు గురైనప్పుడు అంబులెన్స్, పోలీ సు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాలని అనుకుంటే మొబైల్ నెట్‌వర్క్ పనిచేయవు. అటవీ ప్రాంతం కావడంతో నెట్‌వర్క్ సిగ్నల్స్ సరిగా రావు. దీంతో చాలా ఇబ్బందులకు గురవుతున్నాం.
-తొంట బాబు, కో ఆప్షన్ మెంబర్ కుత్బుల్లాపూర్
సకాలంలో పూర్తి చేస్తాం
ఇప్పటికే కొన్ని రోడ్లను మరమ్మతులు చేస్తున్నాం. సకాలంలో రోడ్ల నిర్మాణ పనులు పూర్తిచేసి .. అందుబాటులోకి తీసుకొస్తాం.
-ఇంద్రసేనారెడ్డి, ఏఈ, అబ్దుల్లాపూర్ మెట్ మండలం