calender_icon.png 23 December, 2024 | 9:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కూర‘గాయాల’ బాధ తీరేదెప్పుడు?

27-10-2024 12:00:00 AM

రాష్ట్రంలో కూర ‘గాయాల’ బాధ నుంచి ప్రజలకు ఎప్పుడు మోక్షం వస్తుందో తెలియడం లేదు. రోజురోజుకూ అదే పనిగా వాటి ధరలు మండి పోతున్నాయి. మధ్యదళారులే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా జంట నగరాలలో ఆయా పెద్ద, స్థానిక మార్కెట్లకు కూరగాయల సరఫరాలో రంగారెడ్డి జిల్లానే కీలక పాత్ర పోషిస్తోంది.

పెరిగే జనాభా మేరకు కూరగాయలు అందుబాటులో ఉంటున్నా, వాటి ధరలే ఆకాశాన్ని అంటుతున్నాయి. అనేక మంది రైతులు ఆధునిక పద్ధతుల్లో కూరగాయలను పండిస్తూ కూడా ఆశించిన మేర లాభాలు పొందలేక పోతున్నారు.

రైతులు ప్రత్యక్షంగా మార్కెట్లోకి వెళ్ళకుండా ఏజెంట్లు, మధ్యదళారుల ద్వారా తమ పంటలను ‘అడ్డికి పావుసేరు’ అన్నట్టుగా తక్కువకు అమ్ముకోవలసి రావడం నష్టదాయ కమవుతున్నది. రైతులే ఆన్‌లైన్ ద్వారా వినియోగదారులకు విక్రయించే పద్ధతి రావాలి. అప్పుడు ధరలు తగ్గడమే కాక రైతులకూ ఒకింత మేలు జరుగుతుంది.

 డా.చిట్యాల రవీందర్, మణికొండ