పాత భవనంలో సదుపాయాలు లేక సిబ్బంది కష్టాలు
తుంగతుర్తి, ఫిబ్రవరి 3 ః ప్రభుత్వాలు మారు తున్న.. పాలకులు వస్తూ వెళుతున్న ..అధి కారులు మారుతూ ఉన్నప్పటికీ గడిచిన నాలుగు సంవత్సరాల పైగా 15 లక్షల వ్యయంతో మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్మిం చిన ఎస్‌టివో నూతన భవనం ప్రారంభోత్సవానికి నోచుకోకపోవడం జరిగింది.
గత కొన్ని సంవత్సరాలుగా కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందికి చెప్పుకో లేని రోగాలతో సతమవుతున్నారు. ప్రతిరోజు పాత కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా సిబ్బందికి... కనీసం బాత్రూం లేకపోవడంతో తరచూ, ఎదురుగా ఉన్న జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలకు వెళ్ళవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎస్ టి ఓ భవనం నిర్మించిన కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోనే,నూతన భవనములో చిన్న చిన్న పనులు వదిలివేసి పూర్తి చేయకపోవడంతో ప్రారంభానికి నోచుకోలేకపోవడం జరిగిందని సిబ్బంది ,మేధావులు విమర్శిస్తున్నారు.
తక్షణమే జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే స్పందించి ఎస్ టి ఓ సిబ్బంది కార్యాలయానికి వస్తున్న ప్రజలు, శాఖల సిబ్బంది కనీస అవసరాలను దృష్టిలో పెట్టుకొని, పనులు పూర్తి చేసి తక్షణమే ప్రారంభోత్సవం చేయాలని స్థానికులు కోరారు.