24-03-2025 01:07:37 AM
ఆర్టీసీ ట్రేడ్ యూనియన్ల పునరుద్ధరణ హామీ ఏమైంది?
సమ్మె నోటీసులను పట్టించుకున్న పాపాన పోలేదు!
హైదరాబాద్, మార్చి 23 (విజయక్రాంతి): ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్.. అధికార పగ్గాలు చేపట్టి ఏడాదిన్నర పూర్తయినా ఆ హామీని నెరవేర్చలేదు. ఆర్టీసీ ట్రేడ్ యూనియన్ పునరుద్ధరణ హామీని సైతం పట్టించుకోలేదు. వీటికితోడు ప్రైవేటు భాగస్వా మ్యంతో యాజమాన్యం ఇబ్బడి ముబ్బడిగా ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తున్నది.
ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై ఆర్టీసీ కార్మిక సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికలకు ముందు అరచేతిలో వైకుంఠం చూపిన వారు, ఆ తర్వాత ఆర్టీసీ కార్మికుల గురించే పట్టించుకోవడం లేదని వాపోతున్నాయి. బడ్జెట్ సమావేశాల సందర్భంగా శనివారం అసెంబ్లీ వేది కగా ఆర్టీసీ విలీన అంశం చర్చకు వచ్చింది.
ప్రతిపక్ష పార్టీకి చెందిన సభ్యులు ‘ఆర్టీసీ విలీనం ఎప్పుడు?’ అని నిలదీయగా.. ‘విలీన అంశంపై వేసిన కమిటీతో మరోసారి భేటీ అవుతాం. త్వరలో కార్యాచరణ వివరిస్తాం’ అని ప్రభుత్వం నుంచి సమాధానం వచ్చింది. ఈ సమాధానంపై కార్మికులను నిరాశపరిచేలా ఉన్నాయం టూ కార్మిక సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. తమకిచ్చిన హామీలు నెరవేర్చే దిశగా కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాయి.
కనీసం చర్చలైనా లేవా?
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చి న హామీలను అమలు చేయాలని, తద్వా రా తమ నిజాయితీని నిరూపించుకోవాలని ఆర్టీసీ జేఏసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. యాజమాన్యం తమ సమస్యలను పరిష్కరించకపోగా, కార్మికులతో అదనపు పని చేయిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగా చిన్న కారణాల తో కొందరిని తొలగిస్తోందని వాపోతున్నారు.
ప్రైవేటు ఈవీ బస్సులు తమ ఉపాధికి చెక్ పెట్టేలా ఉన్నాయని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమ హక్కుల సాధనకు ఆర్టీసీ కార్మిక సంఘాలన్నీ జేఏసీగా ఏర్పడ్డాయని, ఇప్పటికే జనవరి 27న యాజమాన్యానికి సమ్మె నోటీసులు సైతం జారీ చేశామని తెలిపారు. యాజమాన్యం మాత్రం నోటీసులను పట్టించుకోలేదని వాపోయారు.
యాజమాన్యం ఫిబ్రవరి 10న కార్మిక సంఘాలను చర్చలకు ఆహ్వానించింది. కానీ.. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ను సాకుగా చూపి చర్చలను పక్కన పెట్టింది. కార్మికులు ఈ నెల 17న మరోసారి పిలిచినా యాజమాన్యం తరఫున ఎవరూ హాజరు కాలేదు. మూడోసారి ఇదే నెల 21న చర్చలకు పిలిచినా మళ్లీ పాత తంతే జరిగింది. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల నెపం చూపెడుతూ యాజమాన్యం తప్పించుకుంటున్నదని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.
కాంగ్రెస్ మ్యానిఫెస్టోలోని హామీలు
* ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికుల విలీనం. వరుసగా రెండు పీఆర్సీల బకాయిల చెల్లింపు
* వచ్చే పీఆర్సీ పరిధిలోకి ఆర్టీసీ కార్మికులు.
* రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వసతులు, సదుపాయాలు
* అందుబాటులోకి అధునాతన బస్సు సర్వీసులు
* ట్రేడ్ యూనియన్ల పునరుద్ధరణకు అనుమతులు
ఆశలు అడియాశలు..
కాంగ్రెస్ ఎన్నికల ముందు ఆర్టీసీ కార్మికులను సర్కారు ఉద్యోగులుగా గుర్తిస్తామని, ట్రేడ్ యూనియన్లను తిరిగి పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చింది. కానీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పక్కనపెట్టింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆర్టీసీకి ఏం చేయలే దనే కార్మికులు ఆ పార్టీని పక్కన పెట్టా రు. కాంగ్రెసోళ్లు మంచి చేస్తారనుకుం టే అది జరగడం లేదు.
పగ్గాలు చేపట్టి ఏడాదిన్నరయినా ఇప్పటికీ సర్కార్ పాత ప్రభుత్వంపైనే నెపం నెడుతున్న ది. కార్మికుల విలీనానికి కమిటీ వేశామని పబ్బం గడుపుతూ వస్తున్నది. ఎప్పుడు కమిటీ ఎప్పుడు వేస్తారో? ఆ కమిటీకి ఎవరు నాయకత్వం వహిస్తున్నారో మాకు తెలియదు. సర్కార్ ఇప్పటికైనా స్పందించాలి. కమిటీ అంశాన్ని తేల్చాలి.
వెంకన్న, జేఏసీ చైర్మన్,
ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
హమీలు ఎప్పుడు నెరవేరుస్తారో చెప్పాలి
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే వరకు హామీలు గుప్పించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల బాగోగులను పట్టించుకోవడం లేదు. గత ప్రభుత్వం మొండిచేయి చూపినట్లు గానే, ఈ ప్రభుత్వమూ చూపుతున్నది. మహాలక్ష్మి పథక బకాయిలను సైతం ఆర్టీసీకి సక్రమంగా చెల్లించడంలేదు. సభల్లో మాత్రం ప్రభుత్వ పెద్దలు యాజమాన్యానికి రూ.3,500 కోట్లు ఇచ్చామని చెప్తున్నారు. దీనిపై శ్వేత పత్రం విడుదల చేయాలని మేం డిమాండ్ చేస్తున్నాం.
థామస్‌రెడ్డి,
ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్, టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి