calender_icon.png 16 April, 2025 | 7:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాధవనగర్ రైల్వే బ్రిడ్జి పూర్తయ్యేదెప్పుడో?

16-04-2025 12:06:30 AM

20 25 మే 31తో నిర్మాణ గడువు పూర్తి 

గుంతల మయంగా తాత్కాలిక రోడ్డు 

వాహనదారుల ఇక్కట్లు వర్ణతీతం కొనసాగుతున్న పనులు 

నిజామాబాద్ ఏప్రిల్ 15: (విజయక్రాంతి): నిజామాబాద్ నగరం నుండి 44వ జాతీయ రహదారి కి అప్రోచ్ రోడ్ గా ఉన్న నిజామాబాద్ హైదరాబాద్ ప్రధాన రహదారి మాధవ నగర్ టీ జంక్షన్ వద్ద నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి ఆర్‌ఓబి పనులు గడువు పూర్తయ్యేలోగా పూర్తి నిర్మాణం జరుగుతుందనే సందేహాలు తలెత్తుతున్నాయి 93. 31 రూపాయల ఏంటో చేపట్టిన ఈ ఆర్‌ఓబి బ్రిడ్జి పనుల గడువు దగ్గర పడింది.

20 25 మే 31 నాటికి ఈ పనులు పూర్తి కావాల్సి ఉంది. త్వరితగతిన రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు పూర్తి చేస్తామని పది రైల్వే ఓవర్ బ్రిడ్జిల్లా పనులు లక్ష్యంగా పెట్టుకున్నామని నిజామాబాద్ ఎంపీ అరవింద్ ప్రకటించినప్పటికిని మాధవ నగర్ ఆర్‌ఓబి పనులు ఇంకా పూర్తి కాలేదు.  మే 31 నాటికి అంటే ఇంకా 46 రోజులు మాత్రమే మిగిలి ఉంది. 

ఈ గడువులోగా రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు పూర్తి చేయాల్సిన లక్ష్యం తో పనులు ప్రారంభించారు.  రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించడంలో జాప్యం జరిగిన కారణంగా నిర్మాణ పనులలో ఆలస్యం జరిగిందని ఎంపీ తెలిపారు.  ఈ రైలు మార్గం మీదుగా భారీ హెచ్ గ్యాటర్లతో ఫ్లోరింగ్ షీట్స్ వేయాల్సి ఉంది ఈ పని మొత్తం ఒకవైపు నుండి కొనసాగడంతో మరొకవైపు పని మిగిలిపోయి ఉంది. 

ఒకవైపు ఫ్లోరింగ్ స్లాబ్ పనులు జరుగుతూ ఉండడంతో మరోవైపు పనులకు గడువు దాటి పనులు జరిగేలా ఉంది.  నిజామాబాద్ జిల్లా కేంద్రంలోకి ప్రధాన ప్రవేశ ద్వారం మాధవ నగర్ రైల్వే మార్గం మీదుగా ఉండడంతో నిత్యం జిల్లాలలోకి వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి.  ఈ మార్గం గుండా 50 కి పైగా ప్రయాణికుల రైలు గూడ్స్ పండ్లు ప్రయాణిస్తుండడంతో తరచూ రైలు మార్గానికి ఇరువైపులా గేట్లు చేయడంతో తరచూ వాహనాలు కిలోమీటర్స్ కు పైగా నిలిచిపోతున్నాయి.

అత్యవసర సర్వీసులు గల వాహనాలు అంబులెన్స్ కూడా ఈ రైల్వే గేట్ వేయడంతో ట్రాఫిక్ లో  చిక్కుకుపోతున్నాయి. ట్రైన్లు వెళ్లిన తదుపరి గేట్లు ఎత్తేయడంతో ఇరువైపుల వాహనాలు దూసుకు రావడంతో కురుక్షేత్ర యుద్ధ దృశ్యాన్ని  తలపిస్తోంది.  గంటల తరబడి రైళ్లకే ఎదురు చూసి విసిగి గేటు నుండి వాహనాలను తరలించే సమయంలో ప్రమాదాలకు గురైన సంఘటనలుగా ఉన్నాయి. 

మాధవ్ నగర్ రైల్వే గేటు వద్ద పట్టాలపై నుంచి స్లాబ్ పనులు సాగాల్సి ఉందని అందుకు గాని ఇరువైపులా కొంత మేరకు పనులు నిలిపివేశామని పనులకు ఉపయోగించడానికి భారీ క్రేన్లు వచ్చినప్పుడు తీవ్ర ఇబ్బంది ఎదురవుతుందని ఉద్దేశంతో పనులు నిలిచిపోయాయనీ సంబంధిత అధికారులు తెలిపారు.  రైల్వే పనుల కారణంగా మిగతా పనులు జరపడంలో జాప్యం జరుగుతోందని రైల్వే అధికారుల అనుమతితో రైల్వే పట్టాల వరకు పనులు పూర్తి చేయనున్నట్టు ఆర్‌ఓబి పర్యవేక్షకులు తెలిపారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారుల మధ్య సమన్వయం లోపించడంతోనే పనులలో తీవ్ర జాప్యం జరుగుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ విరు శాఖల సమన్వయంతోటే పనులు నిర్ణిత సమయానికి పూర్తవుతాయని ఆ దిశగా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఆర్‌ఓబి పనులు 20 22 సెప్టెంబర్ లో అయినప్పటికీని ఇప్పటివరకు 75% పూర్తికాగా మరో ముప్పు ఐదు శాతం పనులు పూర్తికావాల్సి ఉంది. నిర్ణీత సమయంలో మాధవ నగర్ రైల్వే బ్రిడ్జి పూర్తి అవుతే ఈ మార్గం గుండా ప్రయాణించే ప్రజల కష్టాలు తీరనున్నాయి.