- ఫోన్ ట్యాపింగ్ కేసు
- తిరుపతన్న బెయిల్ పిటిషన్‌పై సుప్రీం కోర్టు
- విచారణ 27కు వాయిదా
ఢిల్లీ, జనవరి 2: ఫోన్ ట్యాపింగ్ కేసు లో తెలంగాణ అదనపు ఎస్పీ తిరుపతన్న పాత్రపై దర్యాప్తునకు ఇంకా ఎంత సమ యం పడుతుందని ప్రభుత్వం తరఫు న్యాయవాది సుప్రీం కోర్టు ప్రశ్నించింది. దర్యాప్తు కొనసాగింపు పేరుతో పిటిషనర్ స్వేచ్ఛను అడ్డుకోలేమని పేర్కొన్నది. తిరుపతన్న బెయిల్ పిటిషన్‌పై గురువా రం సుప్రీం కోర్టులో జస్టిస్ బీవీ నాగ రత్న, జస్టిస్ కోటేశ్వర్ సింగ్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్న ప్రధాన నిందితుడని తెలిపారు. రాజకీయ నేతల ఆదేశాల మేరకు అందరి ఫోన్లను ట్యాప్ చేశారని, ఇందులో హైకోర్టు జడ్జిల ఫోన్లు కూడా ఉన్నాయని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ తిరుపతన్న కీలకంగా వ్యవహరించారనిచెప్పారు.
ఆధారాలు చెరిపేయ డంలోనూ కీలకంగా ఉన్నారని పేర్కొన్నారు. 2023 డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వె లువడగానే ఆధారాలు ధ్వంసం చేశారని వెల్లడించారు. మరోవైపు తిరుపతన్న పా త్రపై ఇప్పటికే చార్జిషీట్ దాఖలైందని ఆయ న తరఫు న్యాయవాది సిద్దార్థ దవే తెలిపా రు. 9 నెలలుగా జైలులో ఉన్నారని వాదించారు.
తప్పనిసరైతేనే జైలులో ఉంచాలని సుప్రీం కోర్టు గతంలో తీర్పులు ఇచ్చిందని ప్రస్తావించారు. బెయిల్ పొందడం హక్కు అని పేర్కొన్నారు. ఈ క్రమంలో తిరుపతన్న పాత్రపై దర్యాప్తు ఎప్పటికి పూర్తిచేస్తారని న్యాయస్థానం ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. సుదీర్ఘకాలం కొనసాగడం సరికాదని తెలిపింది. దర్యాప్తు కొనసాగింపు పేరుతో పిటిషనర్ స్వేచ్ఛను అడుకోలేమని చెప్పింది.
విచారణ పూర్తి మరో నాలుగు నెలల సమయం పడుతుందని ప్రభుత్వం తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఎంత స మయం పడుతుందో రాతపూర్వకంగా చె ప్పాలని ధర్మాసనం ఆదేశించింది. ఈ క్రమంలో అఫిడవిట్ దాఖలుకు రాష్ట్ర ప్రభు త్వం తరఫు న్యాయవాది లూథ్రా సమయం కోరారు. దీంతో విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.