calender_icon.png 29 November, 2024 | 3:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తొలి వేతనం అందేదెప్పుడు

06-11-2024 02:41:00 AM

కొత్త టీచర్లకు ఇవ్వని ఐడీలు

ఐడీలు ఒకలా.. సాలరీ మరోలా లెక్కింపు

హైదరాబాద్, నవంబర్ 5 (విజయక్రాంతి): ఇటీవల ఉద్యోగాల్లో చేరిన 10 వేల మందికిపైగా కొత్త టీచర్లకు వచ్చే నెలలోనూ తొలి వేతనం అందుకుంటారో లేదో అనుమానంగానే ఉది. వీరికి ఇంతవరకూ ఎంప్లా యీ ఐడీలు ఇవ్వలేదు. 33 జిల్లాల్లో కేవలం రెండుమూడు జిల్లాలో అందులోనూ కొన్ని మండలాల్లోనే ఉద్యోగ ఐడీలు కేటాయించా రు. మిగతా వారికి ఐడీలు ఇవ్వని పరిస్థితి. వచ్చిన వారికి కూడా ప్రాన్(పర్మినెంట్ రిటైర్‌మెంట్ అకౌంట్ నంబర్) నంబర్లూ జన రేట్ కాలేదు. ఎంప్లాయీ ఐడీ వచ్చి ప్రాన్ ఐడీ జనరేట్ అయితేనే వేతనాలకు సంబంధించిన బిల్లులు చెల్లిస్తామని అధికారులు చెప్తున్నారు.

మరోవైపు కొత్త టీచర్ల డేట్ ఆఫ్ జాయినింగ్ అక్టోబర్ 10, 16 అని విద్యాశాఖ అధికారులు స్పష్టత ఇచ్చినా, రాష్ట్ర ఆర్థిక విభాగం నుంచి తమకు సమాచారం అందలేదని అధికారులు చెప్తున్నారని ఉపాధ్యాయులు వాపోతున్నారు. దీంతో తొలి వేతనం వచ్చే నెలలో కూడా రావడం వారికి కష్టంగా మారిందని కొత్త టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు. 25వ తేదీలోపే బిల్లులు చేస్తే వచ్చే నెలలో వేతనాలు విడుదలవుతాయి. లేదంటే ఇంకా సమయం పడుతుంది. నవంబర్‌లో ఎలాగూ తొలి వేతనం అందుకోలే దని, డిసెంబర్‌లోనైనా అందుకుంటామో లేదోనని వాపోతున్నారు. 

వేర్వేరు తేదీల్లో..

ఐడీలు ఇచ్చేది ఒక తేదీపై... సాలరీ లెక్కింపు చేసేది మరో తేదీ ఉండటంతో ఉపాధ్యాయులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో అక్టోబర్ 10, 16వ తేదీల్లో కొత్త టీచర్లు రిపోర్ట్ చేశారు. దీంతో కొన్ని జిల్లాల్లో 10వ తేదీతో ఐడీలు జారీ చేశారు. 

కొన్ని జిల్లాల్లో 16వ తేదీతో ఐడీలు ఇచ్చా రు. కానీ వేతనం మాత్రం అక్టోబర్ 16వ తేదీ నుంచే లెక్కింపు చేస్తున్నట్లు తెలిసింది. అలా ఎలా చేస్తారని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. 10వ తేదీతో ఇచ్చిన ఐడీలను కూడా మార్చేసి అక్టోబర్ 16వ తేదీతో ఇస్తున్నట్లు బాధిత ఉపాధ్యాయులు చెప్తున్నారు. ఉద్యో గం వచ్చిన ఆనందమే కాని, వేతనం ఎప్పుడొస్తుందోనని కొత్త టీచర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే కొన్ని జిల్లాల్లో ఐడీల కోసం వెయ్యి రూపాయలు వసూలు చేస్తున్నట్లు సమాచారం.