calender_icon.png 18 April, 2025 | 9:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సీ కార్పొరేషన్‌కు గ్రహణం తొలిగేదెప్పుడు?

21-03-2025 01:48:52 AM

మునగాల, మార్చి 20:-- సూర్యాపేట జిల్లా మునగాల ఎస్సీకార్పొరేషన్ ద్వారా 2014-15, 2016-17 ఆర్ధిక సంవత్సరాలలో మాత్రమే లోన్లు నోటిఫికేషన్ ఇచ్చారు , ఇంటర్యూ చేసి అభ్యర్థులను ఎంపిక చేసి నేటికీ లోన్ మంజూరు చేయలేదు అని వెంటనే లోన్ ఇవ్వాలి అని లబ్ధిదారులు కుమారి  అన్నారు.

2017-18, 2018-19, ఆర్థిక సంవత్సరాలలో ఇంటర్యూ లు చేసి కూడా లోన్ మంజురు చేయలేదు, 2020-21 ఆర్థిక సంవత్సరo లో అర్హులను ఎంపిక చేసి కూడా నేటికీ 5 సంవత్సరాలనుండి సబ్సిడీ విడుదల చేయకుండా ఎస్సీ నాటి నేటి ప్రభుత్వాలు హరిగోసలు పెడుతూన్నాయి, పేరుకు కార్పొరేషన్ ను వాడుకుంటూ దళిత సమాజన్ని మభ్యపెట్టి ఓట్లు దండుకోవటం తప్పా ఈ ప్రభుత్వాలు చేసింది.

ఏమి లేదు, వందల ఎకరాలు ఉన్న వాడికి కొన్ని లక్షల రూపాయలు ప్రతి సంవత్సరO ఇవ్వటానికి వెనుకడని ఈ దుర్మార్గ ప్రభుత్వాలు కటిక పేదవాడు తనను తాను పోసించుకోవటానికి ఇచ్చే ఒక్క లక్ష రూపాయల కోసం ఐదు సంవత్సరాలనుండి ఎదురుచూడటం అనేది ఈ ప్రభుత్వలు దళిత సమాజం పై చూపిస్తున్న వివక్ష కు నిదర్శనం గా నిలుస్తున్నాయి.

2021 నుండి ఎన్నోసార్లు జిల్లా  ఎస్సీ కార్పొరేషన్ అధికారులకు, రాష్ట్ర ఎస్సీ, కార్పొరేషన్ అధికారులకు,  ప్రగతి  భవన్ లో ప్రజాదర్బార్ నందు వినతిపత్రాలు ఇచ్చిన ఉపయోగం లేదు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెండింగ్ లో వున్న సబ్సిడీ విడుదల చేసి అర్హులకి న్యాయం చేయాలి అని రాయిరాల సుమన్ గారు మునగాల మండల కేంద్రం లోని అంబేద్కర్  విగ్రహం వద్ద ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

లేదంటే న్యాయ పోరాటానికి దిగుతాం అని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూన్న, ఒక్క సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 650 మంది అర్హులు సబ్సిడీ లోన్ కోసం ఎదురుచూతున్నారు, ఈ నాయ్య పోరాటం లో పాల్గొనాలని, మీ వంతు సహాయం అందించాలి అని అర్హులను వేడుకుంటున్నాను. అనంతరం మునగాల  తాసిల్దార్ కి వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమం లో లబ్ధిదారులు నూకమల్ల నాగమణి, కొమ్ము లావణ్య  పాల్గొన్నారు.