23-03-2025 12:24:17 AM
సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
హైదరాబాద్, మార్చి 22 (విజయక్రాంతి): ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయి లను రాష్ట్ర ప్రభు త్వం ఎప్పటిలోగా చెల్లిస్తుందో చెప్పాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాం బశివరావు డిమాండ్ చేశారు. రీయింబర్స్‌మెంట్‌పై శనివారం అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. బకాయిల వల్ల రాష్ట్రంలోని విద్యార్థులు మానసికంగా ఇబ్బందులు పడు తున్నారన్నారు. పెండింగ్ బిల్లులు పెరిగిపోతుండటం వల్ల కాలేజీలు మూత బడే ప్రమాదం ఉందన్నారు.