calender_icon.png 18 January, 2025 | 4:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాగు సంస్కరణల అమలు ఎప్పుడు?

16-01-2025 12:00:00 AM

భూమిని నమ్ముకున్న రైతు ఎన్ని కష్టాలనైనా భరిస్తాడు కానీ విలువలను వదులుకోడని చెప్పే అద్భుతమైన నవల ‘ ది గ్రేప్స్ ఆఫ్ రాత్’. దాదాపు వందేళ్ల క్రితం అమెరికాను దుమ్ము తుపాను అతలాకుతలం చేసింది. ’డస్ట్ బౌల్’గా చరిత్రకెక్కిన అది గ్రామీణ రైతు కుటుంబాలపై చూపిన ప్రభావం నేపథ్యంగా రాసిందే ఈ నవల. రాత్ అంటే ఒక రకంగా శాపం లేదా శిక్ష అనుకోవచ్చు. ఆ రెండింటి మధ్య కాంట్రాస్ట్‌ను చెబుతుందీ కథ.vఓక్లహామాకి చెందిన వలస రైతు టామ్ కుటుంబం ఎదుర్కొన్న కష్టాల కథ ఇది.

ఎన్ని కష్టాలొ చ్చినా టామ్ కుటుంబం ఒక్కటిగా ఉండటమే కాక అవసరమైన ప్రతిచోటా మానవత్వంతో స్పందించి తోటివారిని ఆదుకొం టుంది. భూమిని ప్రజలకు తిండి పెట్టే వనరుగా కాక డబ్బు సంపాదించే మాధ్యమం గా భూస్వాములు చూడటం వల్లనే దాన్ని నమ్ముకున్న రైతులంతా రోడ్డున పడాల్సి వచ్చిందన్న అభిప్రాయాన్ని రచయిత వ్యక్తంచేస్తారు.

వలస కార్మికుల శిబిరాలకు స్వయంగా వెళ్లి, చూసి ఈ నవల రాశారు జాన్ స్టెయిన్‌బెక్. ఆయనకు 1962లో నోబెల్ బహు మతి వచ్చినప్పుడు న్యాయనిర్ణేతలు ఈ పుస్తకాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. 1939లో పులిట్జర్ ప్రైజ్ అందుకున్న దీన్ని ఆ ఏడాదే సినిమాగా తీశారు.

చారిత్రక నేపథ్యం వల్ల ఇప్పటికీ తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకాల జాబితాలో చేరింది. మన దేశంలో రైతుల దుస్థితికి ఈ నవలలోని హీరో కుటుంబం ఎదుర్కొన్న కష్టాలకు పోలిక ఉంది.అన్ని రాజకీయ పార్టీలు సార్వత్రిక ఎన్నికలకు ముందు రైతు దేశానికి వెన్నుముక, రైతు కోసమే తమ పార్టీ ఉంది, తమ ప్రభుత్వం పని చేసే ప్రభుత్వం అంటూ గొప్పలు చెప్పుకున్నారు.

మొత్తానికి ఈ గారడీ మాటలతో  ఓట్లు దం డుకున్నారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు భరోసా లేకుండా ప్రభుత్వ విధానా లను రూపొందిస్తున్నారు. మాటల్లో ఊరేగించి, చేతల్లో ఉరి బిగించే  మోసకారి విధానాలతో అన్నదాతల ఉసురు పోసుకోవటం బీజేపీ పాలకులకు పరిపాటిగా మారింది.

మాటలు ఘనం.. చేతలు శూన్యం

రైతుల ఆదాయం రెండు రెట్లు పెంచుతామంటూ వాగ్దానాలతో ఊదరగొట్టిన ప్రభుత్వం... ఇప్పుడు ఆ రైతుల వెన్నెముకను కర్కశంగా విరిచేసే చేతలకు తెగిస్తోం ది. చేసిన శ్రమకు, పండించిన పంటలకు కనీసంలో కనీసంగా ఖరీదు కట్టటం అనేది ఒక సాధారణ న్యాయం. కానీ, ఈ సాధారణ న్యాయం గత దశాబ్ద కాలంలో రైతుల కు అందలేదు.

పండించిన పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలన్న అంశానికి చట్టబద్ధత కల్పించాలన్న ఎం.ఎస్. స్వామినాథన్‌కు భారత రత్న అవార్డు ఇచ్చి సత్కరించి చేతులు దులుపుకొంది. కానీ  ఆయన చెప్పిన సూచనలకు మాత్రం నిలువునా పాతర వేసింది.

కనీస మద్దతు ధర కు చట్టబద్ధత, మరో 11 డిమాండ్లతో రైతులు  ఢిల్లీ సరిహద్దుల్లో మంచులో గడగడా వణుకుతూనే  ఆందోళన చేస్తున్నా రు. ఈ ఆందోళన నెలల తరబడి కొనసాగుతోంది. రైతు నాయకుడు జగ్జిత్ సింగ్ దల్లేవాల్ నవంబరు 26న ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి నెలన్నరరోజులు గడిచి పోయినా కేంద్ర ప్రభు త్వ పెద్దల్లో కనీసం చలనం లేకపోవటం శోచనీయం.

ఎండనక,వాననక ఆరుగాలం చెమటోడ్చి కష్టిం చే అన్నదాతలకు బీజేపీ ప్రభుత్వం ఇచ్చే మర్యాద ఇదేనా! రైతులకు ప్రకృతి వైపరీత్యాలతో ఎదురయ్యే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. వాటికి అదనంగా దళారుల మోసాలు, మార్కెట్ ధరల పతనాలు, రవాణా భారాలూ చేరి, కష్టాలూ కన్నీళ్లే రైతులకు మిగిలాయి. నేడు  కేంద్ర పభుత్వ ఆంక్షలు రైతుల పాలిట గుదిబండలుగా మారాయి. వ్యవసాయ పెట్టుబడులను మోయలేని వ్యయభరితంగా ప్రభుత్వ విధానాలు మార్చేశాయి.

ఈ దుర్భర స్థితిగతుల నుంచి రైతులను రక్షించాల్సిన కేంద్ర ప్రభుత్వం తమ నిర్లక్ష్యంతో ఆ కష్టాలను మరింత పెంచుతోందే తప్ప, భరోసా గా నిలవటం లేదు. దరిమిలా దేశంలో గత మూడు దశాబ్దాల్లో నాలుగు లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఇటీవల సుప్రీంకోర్టు తనకందిన అధికారిక నివేదిక నుంచి పేర్కొంది.

ఈ నివేది కలకెక్కని చావులను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఈ ఆత్మహత్యల లెక్క ఏడు లక్షలకు పైబడే ఉంటుందని పరిశీలకుల అం చనా!  సుమారు 65శాతం ప్రజ లు వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా సాగు తున్న మన దేశంలో  రైతుల పరిస్థితి ఇంత దుర్భరంగా ఉండడం చాలా బాధాకరం.

ఇంత కఠినత్వం ఎందుకు?

అన్నం పెట్టే రైతును ఈ రీతి గోస పెట్టే  బీజేపీ ప్రభుత్వం రైతుల కష్టాలను తీర్చకపోగా మీదు మిక్కిలి ఎరువుల ధరలను పెంచుతూ పోతోంది. సహకార వ్యవస్థలను నాశనం చేస్తోంది. మార్కెట్ యార్డులను నిర్వీర్యపర్చి మరిన్ని ఇక్కట్లను జోడించింది. వ్యవసాయరంగం సంక్షోభం నుం చి బయట పడేయటానికి గతంలో స్వామినాథన్ కమిషన్ ఎన్నో సిఫార్సులు చేసింది.

పంటలకు మద్దతు ధరను ఇవ్వాలని, సింగిల్ యూనిట్ ప్రాతిపదికన పంటలకు బీమా సౌకర్యం కల్పించాలని, రైతులందరికీ బ్యాంకు రుణాలు ఇవ్వాలని, మార్కెట్ సదుపాయాలు పెంచాలని సూచనలు చేసింది. దశాబ్దం క్రితం వరకూ అధికారంలోకి రాక ముందు బీజేపీ బలంగా వినిపించి, నినదించిన ఎన్నికల వాగ్దానాల్లో ఇవన్నీ ఉన్నవే.

గద్దెనెక్కాక ఆ హామీలను ఆవలకు విసిరేసింది. రైతులకు  పంగనామాలు పెట్టే పనికి సమాయత్తమైంది. గతంలో యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన రాయితీలను కూడా నిర్దాక్షణ్యంగా తీసేసి, మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చింది. కార్పొరేట్లకు లాభాలు చేకూర్చే దుస్సాహసానికి బహిరంగంగా ఒడిగట్టింది.

వాటిని వెనక్కి తిప్పి కొట్టటానికి లక్షలాదిమంది రైతులు నెలల తరబడి, ఢిల్లీ సరిహద్దుల్లో చారిత్రాత్మక పోరాటం చేసిన చరిత్ర మనకే కాదు,ప్రపంచ  ప్రజలకు తెలిసిందే. ఆ సమయంలో రైతులపైకి సామదా న భేద దండోపాయాలను ప్ర యోగించింది బీజేపీ ప్రభుత్వం.  మనకు నిత్యం మూడు పూట లా అన్నం పెట్టే రైతు ల పైకి కేంద్రబలగాలను ఉసిగొల్పింది.

రైతులను ఖలిస్థానీ తీవ్రవాదులు అని నిందించింది కూడా. ఉద్యమంలో మరణించిన 750 కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం నయాపైసా సహాయం చేయలేదు. రైతుల పట్ల ఇంత కఠినంగా, నిర్దయగా ప్రవర్తించిన ప్రభుత్వం మరొకటి లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో  ప్రధాని మోదీ పార్లమెంటు నిం డు సభలో రైతులకు క్షమాపణలు చెప్పారు.

ఆ మూడు నల్ల చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అయినప్పటికీ, ఆ తరువాత ఈ మూడేళ్లలో రైతులను ఉద్ధరించే చర్య ఒక్కటీ చేపట్టలేదు. ఏడాదికి మూడు విడతలుగా విదిల్చే రూ.6 వేల సహాయాన్నే గొప్ప ఘనకార్యంగా మోదీ పరివారం చెప్పుకుంటోం ది. ఇలాం టి అరకొర విదిలింపులతో దేశ వ్యవసాయ రంగానికి ఒరిగేది ఏమీ ఉండదు. 

పార్లమెంటరీ కమిటీ సిఫార్సులు

రైతు సమస్యలపై అధ్యయనం చేసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇటీవల విడుదల చేసిన నివేదిక కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. కనీస మద్దతు ధరకు గ్యారంటీ, రుణమాఫీ, పీఎం కిసాన్ నిధుల రెట్టింపు, బడ్జెట్‌లో వ్యవసాయరంగ వాటా పెంపు వంటి ప్రతిపాదనలు ఆ కమిటీ చేసింది.

మోదీ ప్రభుత్వం తాను చెప్పుకుంటున్నట్టు రైతులకు ఇప్పటికే చాలా మేలు చేసివుంటే- కొత్తగా ఈ ప్రతిపాదనలు ఎందుకు? రైతుల న్యాయమైన డిమాండ్లను తక్షణం నెరవేర్చాలి. భూములను కార్పొరేట్లకు కట్టబెట్టే ఉదారవాద ఆర్థిక విధానాలను విడనాడాలి. రైతు నిశ్చింతగా ఉండటానికి, వ్యవసాయరం గం పచ్చగా నిలబడటానికి డా.స్వామినాథన్ సిఫార్సులను వెంటనే అమలు చేయా లి.

వారి  మాటలకు ...ఇచ్చిన సూచనలకు... సలహాలకు విలువను ఇవ్వాలి. వాటిని ఆచరణలో పెట్టాలి. మన ఇరుగు పొరుగు నేతలకు ఏం జరిగిందో.. చరిత్ర ను కళ్లారా చూసి గుణపాఠాలు నేర్వకపోతే కాలమే పరిష్కారం చూపుతుంది.