బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బాష
హైదరాబాద్, జూలై 8 (విజయక్రాంతి): ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ఇంకెప్పుడు అమలు చేస్తారని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కొప్పు బాష ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సోమవారం ఆయన మాట్లా డుతూ.. కాంగ్రెస్‌కు ఓట్లు, సీట్లు తప్పా ప్రజా సంక్షేమం పట్టదని, దళితులంటే చిన్నచూపని విమర్శిం చారు. అలాగే ‘అంబేద్కర్ అభయహస్తం’ పేరున మీద ప్రతీ దళిత కుటుంబానికి ఇస్తామన్న రూ.12 లక్షల ఆర్థిక సహాయం అందించే పథకాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.