06-03-2025 12:23:19 AM
హైదరాబాద్, మార్చి 5 (విజయక్రాంతి): ఆధునిక వైద్య రంగంలో రోబోట్స్ పాత్ర రోజురోజుకూ పెరుగుతోంది. జనరల్ మెడిసిన్, సర్జికల్ గ్యాస్ట్రో, లివర్ ట్రాన్స్ ప్లాంటేష న్, హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్, జనరల్ సర్జరీ, యురాలజీ వంటి విభాగాల్లో రోబోటిక్ సిస్ట మ్స్ కీలకంగా మారాయి.
రోబోటిక్ శస్త్రచికిత్స అధిక సౌకర్యం, కచ్చితత్వం, తక్కువ రక్త స్రావం, వేగవంతమైన రికవరీ వంటి ప్ర యోజనాలున్నాయి. అత్యంత అధునాతన ఈ రోబోటిక్ సిస్టమ్స్‌ను సర్జన్ కంట్రోల్ చేస్తారు. ఇప్పటికే హైదరాబాద్‌లోని పలు ప్రైవేటు కార్పొరేట్ ఆస్పత్రుల్లో రోబోటిక్ సర్జరీలు విరివిగా చేస్తున్నారు. ఇటీవలే ప్రభు త్వం నిమ్స్, ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్స్‌లో సైతం రోబోటిక్స్‌ను ప్రవేశపెట్టింది.
ఖరీదు ఎక్కువే..
రోబోటిక్ సర్జరీ ఖర్చుతో కూడుకున్నది. డా విన్సీ సర్జికల్ సిస్టమ్స్, మాకో రోబోటిక్స్ సిస్టమ్స్ మొదలైనవి ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి. వీటికి రూ.25కోట్లు నుంచి 40 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా. రోబోటిక్స్ పరిజ్ఞానాన్ని వాడటం వల్ల ఒక్కో సర్జరీకి అదనంగా రూ.1 లక్ష లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు అం టున్నా రు.
అనేక లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సహా ఇ తర సర్జరీలు చేస్తున్న ఉస్మానియాతో పాటు గాంధీ ఆస్పత్రుల్లోనూ వెంటనే రోబోటిక్స్ సర్జరీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైద్యులు కోరుతున్నారు. దీంతో అ త్యంత మెరుగైన సర్జరీలు, అవయవ మార్పి డి చికిత్సలు చేసేందుకు వీలవుతుందని ఉ స్మానియా, గాంధీఆస్పత్రులకు చెందిన వై ద్యులు ‘విజయక్రాంతి’కి తెలిపారు.
రోబోటిక్ సర్జరీలు.. ప్రయోజనాలు...
రోబోటిక్ ఆర్మ్ మానవ శరీరంలో మైక్రో-సర్జికల్ లెవెల్ కచ్చితత్వంతో కట్స్, స్టిచింగ్ చేస్తుంది. లివర్ అనుబంధనలను నిర్వహించగలదు. శరీరంపై అత్యంత చిన్న కోతలు (కీ హోల్ సర్జరీ ఇన్‌సిజన్స్) ద్వారా శస్త్రచికిత్స చేయడం వల్ల పొత్తికడుపు నొప్పి తగ్గుతుంది. రోగి త్వరగా కోలుకుంటాడు. సర్జరీ అనంతరం పెద్ద గాట్లు, మచ్చలు ఉండవు.
బెటర్ విజులవైజేషన్ ఉండటంతో- 3డీ హై-డెఫినిషన్ కెమెరాల ద్వారా మెరుగైన విజువలైజేషన్‌తో శస్త్రచికిత్స మరింత మెరుగ్గా చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. మృ దువైన కట్స్, కచ్చితమైన టిష్యూ హాండ్లింగ్ ద్వారా రక్తస్రావం గణనీయంగా తగ్గుతుంది.
సాధారణ పద్ధతితో చేసే ఓపెన్ సర్జరీ కంటే తక్కువ రక్తస్రావం, తక్కువ ఇన్‌ఫెక్షన్ అవకాశాలు ఉంటాయి. చిన్న కోతల ద్వారా శస్త్రచికిత్స చేయడం వల్ల ఆస్పత్రిలో ఉండాల్సిన సమయం తగ్గి, రోగి త్వరగా కోలుకుంటాడు.