11-02-2025 12:00:00 AM
పాకాల శంకర్ గౌడ్ :
స్వాతంత్య్రం సిద్ధించి 78 సంవత్సరాలు గడిచినా, పాలకులు మారినా, స్వరాష్ట్రం సిద్ధించి పదేళ్లు గడిచిపోయినా రాష్ట్రంలో నాణ్యమైన విద్య, వైద్యం ప్రజలకు ఉచితంగా అందించలేకపోతున్నాం. ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం ఉచితంగా అందిస్తామని ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ఏండ్లుగా హామీలు ఇస్తూనే ఉన్నారు.
అయితే వారి మాటల కు, చేతలకు పొంతన ఉండడం లేదు. నేటికీ నాణ్యమైన విద్య, వైద్యం ప్రజలకు ఉచితంగా అందడం లేదు. రాష్ట్రంలోని సాధా రణ పౌరులు వారి సంపాదనలో దాదాపుగా 80శాతం విద్య, వైద్యానికే ఖర్చు చేస్తున్నారని ఒక అంచనా.
భారతదేశంలో అత్యధికంగా విద్య, వైద్య రంగాల్లో దోపిడీ జరుగుతోం ది మన తెలుగు రాష్ట్రాల్లోనే. ప్రైవేటు రంగంలో ఫీజులను నియంత్రించలేకపోవడం, ప్రభుత్వ విద్యారంగ పరిర క్షణపై పాల కులకు చిత్తశుద్ధి లోపించడమే ఈ దుస్థితికి కారణం.
బీఆర్‌ఎస్ హయాంలో 6.6 శాతమే
తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక సామాజిక బాధ్యతగా, విద్యావంతులు, మేధావులు, ఉపాధ్యాయ సంఘాలు తెలంగాణ రా ష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎలా ఉండాలో సూ చిస్తూ ప్రతిపాదనలను నాటి ప్రభుత్వానికి సమర్పించారు. వాటిని ఆనాటి ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. కేవలం గురుకుల వి ద్యా వ్యవస్థను మాత్రమే ప్రోత్సహిస్తూ వ చ్చింది.
ఫలితంగా అప్పటికే కొనసాగుతున్న పాఠశాల విద్య నిర్లక్ష్యానికి గురైంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని, కార్పొరేట్ విద్యకు దీటుగా ప్రభుత్వ బడుల్లో అందరికీ నాణ్యమైన విద్యను అం దిస్తామని చెప్పిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప ది సంవత్సరాల అధికారంలో ఉన్న కాలం లో ప్రభుత్వం పాఠశాల విద్యకు కేటాయించిన బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్‌లో సగటుగా 6.6 శాతం మాత్రమే.
ఫలితంగా రాష్ట్రంలోని పాఠశాలల్లో 5895 పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా నడుస్తున్నాయి. 2097 పాఠశాలల్లో అసలు పిల్లలే లేరు(జీరో స్కూల్స్). విద్యా హక్కు చట్టం అమ ల్లోకి వచ్చి 15 సంవత్సరాలు కావస్తున్న రాష్ట్ర బడుల్లో మూత్రశాలలు బాలురకు 74.1శాతం, బాలికలకు 85.14% మాత్ర మే ఉపయోగించే స్థితిలో ఉన్నాయి.
పెరుగుతున్న జీరో బడులు
రాష్ట్రంలో ప్రతి ఏటా జీరో బడులు (పిల్లలు లేని బడులు) పెరుగుతున్నాయి. ప్ర భుత్వ బడులకు ఆదరణ తగ్గుతోందనే వి షయం దీనివల్ల మనకు అర్థం అవుతుంది. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్న ట్టుగా తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల వి ద్యారంగం గాడి తప్పడానికి గత దశాబ్ద కా లంలో కేవలం గురుకులాలను ప్రోత్సహి స్తూ మిగతా బడులను నిర్లక్ష్యం చేయడం, మౌలిక సదుపాయాల కొరత, టీచర్ల కొర త, పర్యవేక్షణ లోపం,సత్ఫలితాలను ఇవ్వ ని పథకాల అమలు, ప్రభుత్వ బడులపై తల్లిదండ్రులకు ఏర్పడిన అభిప్రాయం,వి ద్యారంగానికి సరిపోయే బడ్జెట్ కేటాయించకపోవడం వంటివి ఉన్నాయి.
మ్యానిఫెస్టోలో చెప్పింది 15 శాతం
తెలంగాణ బడ్జెట్‌లో విద్యారంగానికి గత సంవత్సరం లో 21,292 (7.75శాతం) కోట్లు కేటాయించారు.దేశంలోని టాప్ 20 రాష్ట్రాలలో తెలంగాణమాత్రమే రాష్ట్రబడ్జెట్‌లో విద్యారంగానికి అత్యల్పంగా నిధుల ను కేటాయించింది. ఢిల్లీ 21.1శాతం,కర్ణాటక 11 శాతం, ఆంధ్రప్రదేశ్ (12.6 శాతం), కేరళ (14 శాతం), తమిళనాడు (14.1 శాతం) రాష్ట్రాలు విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు మనక న్నా అత్యధిక నిధులు కేటాయించాయి.
ఆ రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణ రాష్ట్ర విద్యారంగా కేటాయింపులు చాలా తక్కు వ. అంతకు ముందు సంవత్సరం బీఆర్‌ఎస్ ప్రభుత్వం బడ్జెట్‌లో విద్యారంగానికి కేటాయించిన రూ.19,93 కోట్లతో పోలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2,199 కోట్లు ఎ క్కువ కేటాయించడం విశేషం. అయితే పెరిగిన బడ్జెట్‌లో 90 శాతం వేతనాలకే సరి పోతుందని విద్యావేత్తలు అంటున్నారు.
మరో వైపు విద్యకు 15 శాతం నిధులు ఇ స్తామని మ్యానిఫెస్టోలో చెప్పిన కాంగ్రెస్ ప్ర భుత్వం అందులో సగం కూడా కేటాయించలేదని ఉపాధ్యాయ సంఘాల నేత ల ఆరోపిస్తున్నారు. పాఠశాల భవనాలు శిధిలావస్థకు చేరున్నా నిర్మాణాలకు నిధులుకేటాయించలేదని కూడా వారు విమర్శి స్తున్నారు.
అయితే గత ఏడాది బీఆర్‌ఎస్ ప్ర భుత్వం బడ్జెట్‌లో విద్యా రంగానికి కేటాయించిన నిధులతో పోలిస్తే ఇప్పుడే 11.5 శాతం కేటాయింపులు పెరిగాయనేది ప్ర భుత్వ వర్గాల వాదన. కానీ పెరిగిన ధరలతో పోలిస్తే ఇది నామమాత్రమే.
కొరవడిన సామాజిక స్పృహ
గతంతోతో పోల్చుకుంటే నేటితరం ఉ పాధ్యాయుల్లో సామాజిక స్పృహ తగ్గిందని చెప్పవచ్చు. ప్రజా ఉద్యమాల్లో వీరి భాగస్వామ్యం కూడా తగ్గింది. ప్రగతిశీల చై తన్యపూరిత భావజాలానికి బదులుగా కా ర్పొరేటీకరణ,వ్యాపారీకరణ, ప్రైవేటీకరణ, స్వచింతన విద్యా రంగంతో పాటు ఉపాధ్యాయుల్లో కూడా నెలకొన్నాయి. ప్రజల కు, ఉపాధ్యాయులకు మధ్య అవినాభావ సంబంధం తగ్గింది.
గతంతో పోలిస్తే నేటితరం ఉపాధ్యాయులపై ప్రజల్లో ప్రేమ అ భిమానాలు, గౌరవం కూడా తగ్గాయి. వా టిని పునరుద్ధరించుకోవాల్సిన బాధ్యత నే టితరం ఉపాధ్యాయులపైన ఉంది.ఉపాధ్యాయులకు బోధనా నైపుణ్యాల పెంపు కోసం ప్రతి సంవత్సరం వృత్త్యంతర శిక్షణలను ఇస్తూ, పర్యవేక్షణ అధికారులతో ని రంతరం పర్యవేక్షిస్తే సత్ఫలితాలు సాధించవచ్చు.
పర్యవేక్షణ అధికారులుగా బోధనా అనుభవం లేని వారిని నియమిస్తే అసలు కే మోసం వచ్చే ప్రమాదం ఉంటుంది. జిల్లా, మండల స్థాయి పర్యవేక్షణ అధికారులుగా బోధనా అనుభవం గల వారిని మాత్రమే నియమించాలి. క్షేత్రస్థాయి పరిస్థితుల్ని, విద్యార్థులు, ఉపాధ్యాయుల సమ స్యలను అర్థం చేసుకోవాలంటే బోధనా అనుభవం ఉన్న అధికారులతో మాత్రమే సాధ్యమవుతుంది.
విద్యకు 15శాతం నిధులు బడ్జెట్‌లో కే టాయించి,ప్రభుత్వ బడులను పటిష్టం చేసి రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల వి ద్యార్థులకు నాణ్యమైన ఉచిత ఉచిత విద్య ను అందిస్తామని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు కే వలం 7.75 శాతం మాత్రమే గత బడ్జెట్ లో కేటాయింపులు చేసింది.
దేశంలోని అ న్ని రాష్ట్రాల్లో విద్యకు కేటాయించిన సగటు బడ్జెట్ 14.7శాతంతో పోలిస్తే ఈ కేటాయింపులు సగం మాత్రమే అని మనం గ మనించాలి. విద్యారంగాన్ని సంక్షోభం నుండి బయట పడేయాలంటే రాష్ట్రంలో వివిధ మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో నడుస్తున్న 30,306 పాఠశాలలో చదువుతున్న 28,95,456 మంది విద్యార్థులు, 2020 సంక్షేమ హాస్టల్లో ఉండి చదువుకుంటున్న 3,30,000 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యా ర్థులు, అలాగే 35000 అంగన్వాడీ సెంటర్లో ఉన్న మూడు లక్షల పూర్వ ప్రాథమిక విద్యార్థుల అవసరాలను పరిగణలోకి తీ సుకోవాలి.
రాబోయే రాష్ట్ర బడ్జెట్‌లో వి ద్యారంగానికి నిధులు కేటాయింపులు పెంచాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ చే యాలంటే,రాష్ట్రంలోని బాలలకు నాణ్యమై న విద్య ఉచితంగా అందాలంటే ప్రభుత్వం నియమించిన విద్యామిషన్ సిఫారసులను తప్పకుండా అమలు చేయాలి.
ఉన్నత వి ద్యా రంగానికి బడ్జెట్ పెంచడంతో తప్పు లేదు కానీ పాఠశాల విద్య అనేది విద్యార్థి భవిష్యత్తుకు తొలి మెట్టు.ఈ రంగాన్ని బ లోపేతం చేయకపోతే విద్యావ్యవస్థ అంతా కుక్కలు చింపిన విస్తరిలాగా తయారవుతుంది. ఉపాధ్యాయల్లో జవాబుదారీ తనా న్ని పెంచడమే కాకుండా వారు క్రమం తప్నకుండా పాఠశాలలకు వచ్చి చదువులు చెప్పేలా చూడాలి.
ఇటీవల యాదాద్రి భు వనగిరి జిల్లాలో దీర్ఘకాలంలో సెలవులు పెట్టి , తమ స్థానంలో తాత్కాలికంగా టీచర్లను నియమించుకొని కాలం గడుపున్న చాలామంది ఉపాధాయయయలను స ర్వీస్‌నుంచి తొలగించడం జరిగింది. ఇ లాంటి పరిస్థితి ఆ ఒక్క జిల్లాలోనే లేదు.
కాబట్టి పాఠశాలల పని తీరును ఉన్నతాధికారులు తరచూ పర్యవేక్షిస్తూ ఉండాలి. బడ్జెట్ కేటాయింపులు పెంచి, విద్యా కమీషన్ సిఫార్సులను అమలు చేస్తేనే రాష్ట్రం లో ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ సాధ్యమవుతుంది, బడుగు బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన ఉచిత విద్య అందుతుంది.
వ్యాసకర్త సెల్: 9848377734