17-04-2025 12:00:00 AM
ఎమ్మెల్యే అనిల్ జాదవ్
బజార్‌హత్నూర్, ఏప్రిల్ 16(విజయక్రాం తి): రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలో భాగంగా నవ వధువుకు లక్ష రూపాయల నగదుతోపాటు తులం బంగారం ఎప్పుడు ఇస్తారని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బజార్ హత్నూర్‌లోని రైతు వేదికలో బుధవారం ఏర్పాటు చేసిన కల్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమనికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాలకు చెందిన 42 మం ది లబ్ధిదారులకు రూ.1,00,116/- చొప్పున చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రారంభించిన రూ.లక్షతో పాటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం తులం బంగా రం అందజేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర గడుస్తున్న ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెందిందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.