calender_icon.png 14 April, 2025 | 7:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరకట్ట ఎప్పటికి పూర్తి చేస్తారు?

05-04-2025 01:17:30 AM

సంవత్సరం గడిచినా ఎక్కడి పనులు అక్కడే ఎందుకు ఉన్నాయి?

మీ నిర్లక్ష్యం వలన భద్రాద్రి వాసులను ముంపుకు గురి చేస్తారా?

ఇరిగేషన్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

భద్రాచలం , ఏప్రిల్ 4 (విజయ క్రాంతి) భద్రాచలం పట్టణంలోని సుభాష్ నగర్ కాలనీ ఇల్లు ముంపుకు గురి కాకుండా నిర్మిస్తున్న కరకట్ట సంవత్సరం గడిచిన ఏ మాత్రం పురోగతి లేదని కరకట్ట నిర్మాణం ఎందుకింత జాప్యం జరుగుతున్నదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇరిగేషన్ అధికారులను నిలదీశారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భద్రాచలం ప్రాంత పర్యటనకు శుక్రవారం వచ్చిన సందర్భంగా గతంలో ఆయన రూ45 కోట్ల  మంజూరు చేయించిన కనకట్టు నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కరకట్ట నిర్మాణ పురోగతిని పరిశీలించారు.

సంవత్సరం కింద నేను వచ్చినప్పుడు ఏ విధంగా ఉందో ఇప్పుడు కూడా అదే విధంగా ఉం దని నిర్మాణ పనులు ఎందుకు పూర్తి చేయలేదని దీనికి బా ధ్యత ఎవరు తీసుకుంటారని మంత్రి తుమ్మల ఇరిగేషన్ అధికారులను ప్రశ్నించారు.అదేవిధంగా మరో రెండు నెలలు గోదావరి వరదలు వచ్చే అవకాశం ఉన్నందున ఈ ప్రాంతం అంతా ముంపు గురి అయ్యే అవకాశం ఉందని, మీ నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వం బదనామవుతుందని తెలిపారు. కరకట్ట ని ర్మాణం ఎందుకు జాప్యం జరుగుతున్నది అని ప్రశ్నిస్తే  సరైన సమాధానం రావడం లేదని అన్నారు.

ఈ సందర్భంగా మంత్రి అక్కడినుండి ఫోన్ ద్వారా ఉన్నతాధికారులతో కింద స్థాయి అధికారులు చేస్తున్న  నిర్వాకం గురించి వివరించి వెంటనే కరకట్ట పనులు ప్రారంభించి రెండు నెలల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శ్రీరామనవమి పూర్తి అయిన తర్వాత జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి కరకట్ట నిర్మాణం పూర్తి అయ్యేలా చూడాలని ఆదేశించారు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐటీడీఏ పీవో రాహుల్ భద్రాచలం ఆర్డీవో దామోదర్ రావు ఏఎస్పీ క్రాంతి కుమార్ సింగ్ ఇరిగేషన్ ఇయ్యి జానీతో పాటు కాంగ్రెస్ నాయకులు భోగాల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.