తెలంగాణలో గ్రంథాలయ ఉద్యమం 19వ శతాబ్దంలో సాలార్‌జంగ్ సంస్కరణల ఫలితంగా ప్రారంభమైంది. తద్వారా ఆధునిక భావజాలం ప్రజలలో వ్యాపించింది. ఈ ప్రాంతంలో సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ ఉద్యమాలకు, అన్ని వర్గాల ప్రజల చైతన్యానికి ఉద్యమం తోడ్పడింది. మరోవైపు దీనితో రాజకీయ చైతన్యం బ్రిటిష్ ప్రభుత్వానికి, నిజాం రాజు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా మొదలైంది. చివరకు భూస్వామ్య వ్యతిరేక ఉద్యమంగానూ గ్రంథాలయ ఉద్యమం రూపాంతరం చెందడం గమనార్హం.
తెలుగు ప్రజలు ప్రాచీన, మధ్యయుగం లో తాము సాధించిన ప్రగతిని తెలుసుకోవడానికి, తెలంగాణ చరిత్రకు సంబంధిం చిన గ్రంథాలను ప్రజలకు అందుబాటులోకి తేవడానికి చేసిన ప్రయత్నంగా దీనిని భావించాలి. తెలంగాణలో సాంస్కృతిక వికాసోద్యమానికి గ్రంథాలయ ఉద్యమం దారితీసింది. అందులో భాగంగా అనేక క్లబ్బులు, సాహిత్య సంస్థలు పురుడు పోసుకున్నాయి. నిజాం రాష్ట్రంలో సాహితీ రంగానికి ఒక విశిష్టమైన స్థానం ఉంది. నిజాం నిరంకుశ పాలనను కూకటివేళ్లతో పెకలించేందుకు గ్రంథాలయ ఉద్యమం తోడ్పడింది.
ఇది ప్రధానంగా తమ సమస్యల మూలకారణాలకు సంబంధించిన అవగాహనను, చైతన్యాన్ని ప్రజలకు కలిగించింది. జ్ఞానాన్ని పంచే ప్రతి పుస్తకం ఎన్నో ఉద్యమాలకు ప్రేరణ ఇస్తుంది. అం దుకే, నిజాం ప్రభుత్వం గ్రంథాలు బయటి కి రాకుండా కట్టుదిట్టమైన చర్యలను చేపట్టింది. కానీ, ఎంత నిర్బంధం, నిఘా ఉన్న ప్పటికీ గ్రంథాలయ ఉద్యమాన్ని అప్పటి ప్రభుత్వం ఆపలేక పోయింది. ప్రభుత్వం కళ్లు గప్పి ప్రజలకు రహస్యంగా గ్రంథాల ను పంపిణీ చేసేవారు. ప్రభుత్వ అధికారులకు అనుమానం రాకుండా నిర్వాహకులు ఉద్యమాన్ని రహస్యంగా కొనసాగించారు.
తొలి గ్రంథాలయం
మొదట 1872లో సికింద్రాబాద్‌లో సోమసుందర్ మొదలియార్ గ్రంథాలయాన్ని స్థాపించారు. దీనిని హైదరాబా ద్‌లోనేకాక తెలుగు ప్రాంతాల్లోనే మొదటి గ్రంథాలయంగా చెప్పుకోవచ్చు. ఆ తరువాత కొంత కాలానికి 1884లో దీన్ని మహబూబియా కళాశాలలో విలీనం చేశా రు. అలాగే, 1872లో ముదిగొండ శంకరాద్యులు సికింద్రాబాద్‌లోని శంకరమఠ్‌లో ‘శంకరానంద’ గ్రంథాలయం స్థాపించారు.
మరో ‘సార్వజనిక’ గ్రంథాలయాన్ని కూడా సికింద్రాబాద్‌లో స్థాపించారు. 1892లో ‘అసఫియా స్ట్రీట్ సెంట్రల్ లైబ్రరీ’ స్థాపితమైంది. మొదట్లో ఈ గ్రంథాలయంలో అరబ్బీ, పర్షియన్, ఉర్దూ, ఇంగ్లీష్, సంస్కృ త గ్రంథాలు మాత్రమే లభించేవి. చివరకు ‘ఆంధ్ర మహాసభ’ కృషివల్ల 1940 నుంచి ఇతర ప్రాంతీయ భాషలైన తెలుగు, కన్నడ, మరాఠీ, హిందీ భాషా గ్రంథాలు కూడా అందుబాటులో ఉంచారు.
భాషా నిలయం కృషి
గ్రంథాలయోధ్యమానికి పితామహుడు కొమర్రాజు లక్ష్మణరావు.. ‘మునగాల రా జు’గా పిలిచే నాయిని వెంకట రంగారావు సంస్థానంలో దివాన్‌గా పని చేసేవారు. వెంకట రంగారావు, కొమర్రాజు లక్ష్మణ్‌రావు పరిశోధనకు, భాషాసేవకు కావాల్సి న ఆర్థిక సాయం చేసి అండగా నిలబడి ప్రోత్సహించారు. నాయిని వెంకట రంగారావు, రావిచెట్టు రంగారావులతో కలిసి కొమర్రాజు లక్షణరావు 1901లో ‘శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయాన్ని’ హైదరాబాద్‌లో స్థాపించారు. ఈ గ్రంథాల యం మొదట్లో రావిచెట్టు రంగారావు స్వగృహంలోనే స్థాపితమైంది.
ఆదిపూడి సోమనాథరావు, మైలవరపు నరసింహశాస్త్రి, రఘుపతి వెంకటరత్నం నాయుడు ప్రభృతులు అప్పటి సమావేశంలో పాల్గొన్నారు. తెలుగు భాషా స్థితిని మెరుగు పర చటమే ఈ గ్రంథాలయ స్థాపన ప్రధాన ఉద్దేశంగా ఉండింది. ‘శ్రీకృష్ణ దేవరాయాం ధ్ర భాషా నిలయం’ తెలంగాణ సాంస్కృతిక పునర్జీవనానికి, తెలంగాణ గ్రంథాల యోద్యమానికి మంచి ఊపునిచ్చింది.
ఆధునిక విజ్ఞానశాస్త్రంలో అభివృద్ధి సాధించనిదే భారతదేశం ప్రగతిపథంలో అడుగుపెట్టలేదని గుర్తించిన కొమర్రాజు లక్ష్మణరావు, రావిచెట్టు రంగారావులు హైదరాబాద్‌లో 1960లో ‘విజ్ఞాన చంద్రి కా మండలి’ని స్థాపించారు. ఇది తెలంగాణలో నవలల పోటీలను నిర్వహించింది. తెలుగు ప్రాంతంలో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించిన మొదటి సంస్థ ఇది. ఏ సంక్లి ష్ట విజ్ఞానశాఖ అయినా మాతృభాషలో బోధించవచ్చుననీ, అప్పుడే అది సులభం గా విస్తరించగలదని ఆ మండలి భావించింది.
తెలుగుభాషలో ఈ ‘విజ్ఞాన చంద్రికా మండలి’ చరిత్ర, సాహిత్యం, విజ్ఞాన శాస్త్రాల్లో పుస్తకాలు ప్రచురించి భావవ్యాప్తికి దోహదం చేసింది. అంతేగాక ఆంధ్ర, తెలంగాణ సాంస్కృతిక సంబంధాలు అభివృద్ధి పరచటంలోనూ కీలక పాత్ర పోషిం చింది. దేశ చరిత్రను, పదార్థ విజ్ఞానం, రసాయన శాస్త్రం, జీవవృక్ష శాస్త్రాలకు సంబంధించిన అనేక గ్రంథాలు ‘విజ్ఞాన చంద్రికా మండలి’ కృషి ఫలితంగా వెలువడ్డాయి. గ్రంథాలయోద్యమం ప్రజలలో తెలుగు భాషాభిమానాన్ని కలిగించటంతోపాటు నిజాం రాజ్యాధికారాన్ని ప్రశ్నించే స్థాయికి ప్రజలను చైతన్య పరిచింది.
గ్రంథాలయోద్యమంలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా అనేక గ్రంథాలయా లు స్థాపితమైనాయి. 1910లో ఖమ్మంలో ఆంధ్ర భాషా నిలయం, విజ్ఞాన నికేతనం, 1913లో వరంగల్ జిల్లా ముదిగొండలో ప్రతాపరుద్ర ఆంధ్రభాష నిలయం, 1913 లో సికింద్రాబాద్‌లో ‘సంస్కృత కళావర్ధిని గ్రంథాలయం’ స్థాపితమైనాయి. 1918లో హైదరాబాద్‌లో రాజ బహుదూర్ వెంకట రామిరెడ్డి చొరవతో ‘రెడ్డి హాస్టల్ గ్రంథాలయం’ ఏర్పడింది. ఈ గ్రంథాలయంలో తెలంగాణలో లభించిన తాళపత్ర గ్రంథాలను భద్రపరిచారు.
సురవరం ప్రతాపరెడ్డి ఈ గ్రంథాలయానికి 1924 నుంచి 1932 వరకు కార్యదర్శిగా పనిచేశారు. 1923 ఏప్రిల్‌లో మాడపాటి హనుమంతరావు కార్యదర్శిగా, అడ్వొకేట్ రాజగోపాల్‌రెడ్డి అధ్యక్షుడిగా ‘ఆంధ్ర జన కేంద్ర సంఘం’ స్థాపితమైంది. గ్రంథాలయాలను, పాఠశాలలను స్థాపించడం, తాళపత్ర గ్రంథాలను సేకరించి, చారిత్రక పరిశోధనలు జరిపి తెలంగాణ వైభవానికి వెలుగులు తేవడం, తెలుగుకు ప్రాచుర్యం కల్పించడం, కరపత్రాలను, పుస్తకాలను ప్రచురించి ప్రజలను చైతన్యవంతులను చేయటం మొదలైన కార్యక్రమాలను ఈ సంఘం తన లక్ష్యాలు గా నిర్ణయించుకొంది. 1930లో ‘ఆంధ్ర మహాసభ’ ఏర్పడే వరకు తెలంగాణలో సాంస్కృతిక వైవిధ్యానికి, వికాసానికి పై సం ఘం కృషి చేసింది.
ఆంధ్ర సంఘం గౌరవ ప్రచారకులు పువ్వాడ వెంకటప్పయ్య, ప్రధాన కార్యదర్శి మాడపాటి హనుమంతరావులు తెలంగాణలో అనేక ప్రాంతాల్లో పర్యటించి కొత్తగా ఏర్పడిన గ్రంథాలయా లో ఉపన్యసించడం ద్వారా ప్రజలలో చైత న్యం నింపారు. వీరందరి కృషితో తెలంగాణలో మారుమూల ప్రాంతాలలోనూ గ్రం థాలయాలు అనేకం స్థాపితమైనాయి. ఈ రకం గా తెలంగాణలో సామాజి క, ఆర్థిక, భాషా, సంస్కృతుల వికాసానికి, ప్రజలలో రాజకీయ చైతన్యానికి గ్రంథాలయోద్యమం నిర్వహించిన పాత్ర ఎనలేనిది.