calender_icon.png 6 April, 2025 | 8:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికలొస్తే అధికారం మాదే

06-04-2025 01:27:43 AM

  1. కాంగ్రెస్‌పై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత 
  2. ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల నేతలతో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్
  3. వరంగల్ సభను విజయవంతం చేయాలని పిలుపు

హైదరాబాద్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): తెలంగాణలో మళ్లీ ఎన్నికలు జరిగితే తామే అధికారంలోకి వస్తామని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. హామీలు అమలు చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత రోజురోజుకూ పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ పెట్టి 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా రజతోత్సవ మహాసభను ఈనెల 27న వరంగల్‌లో నిర్వహిస్తున్నారు.

ఈ నేపథ్యంలో కేసీఆర్ శనివారం ఉమ్మడి నల్లగొం డ, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల ము ఖ్యనేతలతో ఎర్రవల్లి ఫాంహౌజ్‌లో సన్నాహక సమావేశం నిర్వహించారు. దీంతో తెలంగాణలోని అన్ని జిల్లాల ముఖ్య నేతల తో సమావేశాలు ముగిశాయి. ఈ సం దర్భంగా జాతీయ, రాష్ట్రస్థాయి అంశాలపై కేసీఆర్ వారితో ముచ్చటించారు. వరంగల్ సభ ఏర్పాట్లపై కేసీఆర్ వారికి దిశానిర్దేశం చేశారు.

ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ పట్ల బీఆర్‌ఎస్‌కు ఉండే నిబద్ధత ఇంకో పార్టీ కి ఉండదన్నారు. తెలంగాణను విఫలప్రయోగంగా మార్చాలని చూసిన శక్తులే తమ పాలనను తప్పుబడుతున్నాయని కేసీఆర్ మండిపడ్డారు. అమలుకు సాధ్యంకాని హా మీలతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి పాలన చేతకావడం లేదని, దీంతో ప్రజలను ముఖ్యంగా అన్నదాతలను ఇబ్బందులు పెడుతుందన్నారు.

గ్యారెంటీలు అమలు చేయలేక చేతులెత్తేశారని, ప్రభుత్వం వద్ద సరైన ప్రణాళికలు లేకపోవడంతో జీఎస్టీ రాబడులు కూడా తగ్గిపోయాయని కేసీఆర్ వాపోయారు. అన్నివర్గాల ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారని కేసీఆర్ చెప్పారు. సాగు, తాగునీరు ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు నీళ్లు ఇవ్వలేకపోతుందని మండిపడ్డారు.

గ్రామాల్లో పాలన అధ్వానంగా మారిందని ధ్వజమెత్తారు. అన్నివర్గాల ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారని, ప్రజలకు తాము ఏంకోల్పోయా మో ఇప్పుడిప్పుడే  తెలుసుకుంటున్నారని కేసీఆర్ చెప్పారు. విద్యుత్ రంగంపై ఎంతో కృషిచేసినందునే 24 గంటల కరెంట్‌ను వ్యవసాయానికి  

ఇవ్వగలిగామని కేసీఆర్ నేతలకు వివరించారు. శాంతియుతంగా పోరాడి హెచ్‌సీ యూ విద్యార్థులు విజయం సాధించారని, పార్టీ నేతలు వారికి అండగా నిలిచారని కేసీఆర్ అభినందించారు. రజతోత్సవ సభకు లక్షలాదిగా ప్రజలు వస్తున్నందున వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నేతలు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. మహాసభ అనంతరం పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభించాలని కేటీఆర్‌కు సూచించారు.

జిల్లా పార్టీ కార్యాలయాల్లో పలు రంగాల నిపుణులతో శిక్షణా తరగతులు నిర్వహిస్తామని కేసీఆర్ తెలిపారు. సభకు హాజరయ్యే కార్యకర్తలు, నేతలు గ్రామాల్లో పార్టీ జెండా ఎగురవేయాలని కేసీఆర్ సూచించారు. ఈ మూడు జిల్లాల నుంచి వరంగల్ సభకు భారీఎత్తున జనసమీకరణ చేయాలని, పార్టీకి పునర్వైభవం తెచ్చేలా పనిచేయాలని నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. సభను విజయవంతం చేసేందుకు కృషిచేయాలన్నారు.

సమావేశంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నేతలు ఎమ్మెల్యే విజయుడు, మా జీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పు వ్వాడ అజయ్, ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు