05-03-2025 12:23:41 AM
నాగల్ గిద్ద, మార్చి 4 : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కారస్ గుత్తి పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి విద్యార్థులకు విద్యాబోధన చేసి మెప్పించారు. మంగళవారం స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులుగా ఎంపిక కాబడిన పదవతరగతి విద్యార్థులు చక్కటి పాఠ్యాంశ బోధన చేసి ఆరు నుండి 10వ తరగతి విద్యార్థులకు బోధించి తమదైన ముద్ర వేసుకున్నారు.
ఒక రోజు ఉపాధ్యాయులుగా అవకాశం ఇస్తే చక్కగా ఉపాధ్యాయులను అనుకరిస్తూ , అనుసరిస్తూ బోధించారు అలాగే విద్యార్థులను క్రమశిక్షణలో ఉంచి వారి అనుభవాలను పంచుకున్నారు.
ఈ స్వయం పరిపాలన దినోత్సవంలో జిల్లా కలెక్టర్ గా యం,సంగీత, రీజినల్ జాయింట్ డైరెక్టర్ గా బి.పూజ , జిల్లా విద్యాశాఖాధికారిగా జె.శివకుమార్ , మండల విద్యాశాఖ అధికారిగా జె.శివకుమార్ ప్రధానోపాధ్యాయులుగా యస్. కె.సామ్రీన్ , పిఈటి గా సోపాన్ ,అనిల్ ఉపాధ్యాయులుగా సుశీల్,వర్ష,దీక్ష, ఆఫీస్ సబార్డినేట్ గా అవినాష్ ,వికాస్, బాధ్యతలు నిర్వహించారు .
చక్కటి బోధన చేసిన విద్యార్థి ఉపాధ్యాయులను ఎంపిక చేసి బహుమతులను ప్రధానం చేశారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు హీరమన్, ఉపాధ్యాయులు పుణ్యవతి,విజయ లక్ష్మి, మురళీ తదితరులు పాల్గొన్నారు.