21-02-2025 05:06:50 PM
చేగుంట (విజయక్రాంతి): మెదక్ జిల్లా చేగుంట మండలం అనంతసాగర్ ప్రాథమికొన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఫర్జానా మేడం ఆధ్వర్యంలో ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి ఉదయం తరగతులు బోధిస్తూ పాఠశాల నిర్వహణ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొని, డిఈఓ గా మహేందర్, ఎంఈఓ గా శివప్రసాద్, హెచ్ ఎం గా విష్ణు వర్థన్, ఉపాధ్యాయులుగా వైష్ణవి, భవాని, మేనక, నందిని, శ్రావ్య, శృతి, ప్రవీణ్, అఖిల్, వంశి, మధు, అవినాష్ లు బాధ్యతలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సత్యనారాయణ, బాల పోచయ్య, జ్యోతి, రాఘవేంద్ర ప్రసాద్, రంజిత్ పాల్గొన్నారు.