calender_icon.png 17 March, 2025 | 8:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారం పోయాక.. ప్రాంతీయ విభేదాలా!

17-03-2025 01:23:39 AM

  • బతుకమ్మ పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చలేదా? 

ఎమ్మెల్సీ కవితపై కాంగ్రెస్ నేత పిడమర్తి రవి ఫైర్

హైదరాబాద్, మార్చి 16 (విజయక్రాంతి): ఎమ్మెల్సీ కవితకు జైలుకెళ్లి వచ్చాక మత్రిభ్రమించిందని, కాంగ్రెస్ ప్రభుత్వంపై అభాండాలు వేస్తోందని కాంగ్రెస్ నేత, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి విమర్శించారు. అధికారం కోల్పోవడంతో ప్రాంతీయ విభేదాలను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆదివారం ఒక ప్రకటనలో మండిపడ్డారు.

అందెశ్రీ రాసిన జయజయహే తెలంగాణ రాష్ట్ర గీతానికి ఏపీకి చెందిన వ్యక్తి సంగీతం సమకూర్చారంటూ కవిత అవాకులు, చవాకులు పేలడం సరికాదన్నారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్రంలో ఆంధ్రా పెట్టుబడిదారులకు కేసీఆర్ కాంట్రాక్టు పనులు కట్టబెట్టారని, కవిత తన బతుకమ్మ పాటలకు ఏఆర్ రెహమాన్‌తో సంగీతం సమకూర్చిందని, తమిళ దర్శకుడితో పాటలు సమకూర్చుకున్న విషయం మర్చిపోవద్దని పిడమర్తి హితవు పలికారు.