20-04-2025 12:00:00 AM
అమ్మాయిలకు వచ్చే నెలసరి గురించి ఓపెన్ కామెంట్స్ చేసింది బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ మాట్లాడుతూ.. “నాకు పీరియడ్స్ సమయంలో తీవ్రమైన మూడ్ స్వింగ్స్ వస్తాయి. నా మాట తీరును బట్టి నాకు పీరియడ్స్ ఉన్నాయని అర్థం చేసుకునేవారు చాలామందే ఉన్నారు. ఆ సమయంలో కొంతమంది మంచి ఉద్దేశంతో ‘నీకు పీరియడ్స్ టైమా? విశ్రాంతి తీసుకో’ అని చెబుతుంటారు.
కానీ, కొందరు మూడ్ స్వింగ్స్‌పై వ్యగ్యంగా మాట్లాడుతుంటారు. అలాంటి వారిని చూస్తే బాధేస్తుంది. పీరియడ్స్ నొప్పి అనేది నిజంగా అనుభవించేవాళ్లకే తెలుసు. ఒకవేళ మగవాళ్లకు పీరియడ్స్ వస్తే, ఒక్క నిమిషం కూడా ఆ బాధను భరించలేరు. అదే జరిగితే బహుశా అణుయుద్ధం జరుగుతుందేమో. ఇలాంటి అంశాలపై బహిరంగ చర్చలు జరగడం అవసరం.
మహిళలకు పీరియడ్స్ రావడమనేది సహజ శారీరక ప్రక్రియ అని అర్థం చేసుకుని, ఆ సమయంలో అందరూ వారికి సానుభూతితో మద్దతు ఇవ్వాలి. సమాజం మెచ్యూర్డ్‌గా ఆలోచించాలి” అని పేర్కొంది. జాన్వీ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
‘దఢక్’ సినిమాతో హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీకపూర్.. తెలుగులో తొలిసారి ఎన్టీఆర్‌తో ‘దేవర’లో నటించింది. టాలీవుడ్‌లో మరోమారు ‘పెద్ది’ చిత్రంలో రామ్‌చరణ్‌తో జోడీ కడుతోంది. బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 2026 మార్చి 27న థియేటర్లలో విడుదల కానుంది.