30-03-2025 12:00:00 AM
గోదావరిఖని సీఎంపీఎఫ్ అధికారులు పెరిగిన కొత్త పెన్షన్ సెటిల్మెంట్ లిస్టు విడుదల చేనప్పటికీ డబ్బులు మాత్రం మాజీ కార్మికుల బ్యాంకు ఖాతాల్లో వెయ్యలేదు. విషయాలు తేలుసుకోవడం కోసం వారు పని చేసిన గనులు, డిపార్టుమెంట్ అధికారుల వద్దకు వెళితే, వారు సరిగా సమాధానం చెప్పడం లేదని, తమను పట్టించుకోవడమే లేదని మాజీ కార్మికులు ఆవేదనతో వాపోతున్నారు. 1 జూలై 2021 నుంచి ఆగస్టు 2023 మధ్య 11వ వేతన ఒప్పందం పరిధిలో రిటైర్ అయిన కార్మికులు దాదాపు 4 వేలకు పైగా ఉన్నారు.
ఇందులో కొందరు వారి పెన్షన్‌కు సంబంధించిన అన్ని కాగితాలనూ గోదావరిఖని సీఎంపీఎఫ్ కార్యాలయ నిబంధనల మేరకు సమర్పించారు. ప్రతి మాజీ కార్మికుడు, అతని భార్య కలిసి దిగిన ఫొటోలను వారు పనిచేసిన చోట అప్పగించారు. సం బంధిత అధికారులు వాటిని గోదావరిఖని సీఎంపీఎఫ్ కార్యాలయానికి పంపించి తమ పని అయిపొయిందని చేతులు దులు పుకున్నారు.
గోదావరిఖని సీఎంపీఎఫ్ ఆఫీస్ వారే సెటిల్మెంట్ చేస్తారని చూస్తున్నారు. కానీ, సెటిల్మెంట్‌కు ఎందుకు ఆలస్యమవుతున్నదీ ఎవరికీ బోధ పడడం లేదు. సెటిల్మెంట్ చేయవలసిన బాధ్యత తమదే అనే విషయాన్ని సంబంధిత అధికారులు మర్చిపోతున్నారు. ‘తమకేమి సంబంధం లేనట్లు’ వారు వ్యవహ రించడం అన్యాయం. అయితే, గోదావరిఖని పరిధిలో 11వ వేతన ఒప్పందానికి సంబంధించి 1,629 మంది రిటైర్మెంట్ కార్మికుల రివైజ్డ్ పెన్షన్ సెటిల్మెంట్ అయింది. అయినా, పెరిగిన కొత్త పెన్షన్, వాటి బకాయిల డబ్బులు ఇంత వారు వారి బ్యాంకు ఖాతాలో ఎందుకు జమ చేయలేదు? ఏప్రిల్ నెలలో అయినా జమ చేస్తారని మాజీ కార్మికులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.
సెటి ల్మెంట్ అయిన వారి లిస్టులో ఉన్న పేర్లను గని, డిపార్ట్మెంట్ల నోటీ స్ బోర్డ్‌ల వద్ద అంటించాలి. ఆ విధంగానైనా రిటైర్మెంట్ కార్మికులు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఆర్థిక బాధల నుంచి ఉపశమ నం కల్పించి మాజీ కార్మికులు, వారి కుటుంబాలు సంతో షంగా ఉండటానికి సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం సార్ చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. పదవ వేజ్ బోర్డ్‌కు ముందు రిటైర్ అయిన కార్మికులకు చెందిన కొందరికి పాత పెన్షన్ పేమెంట్ ఆర్డర్‌లలో భార్య పుట్టిన తేదీకి, ఆధార్ కార్డ్‌లలో ఉన్న పుట్టిన తేదీకి పొంతన కుదరడం లేదు. ఇప్పటికైనా పాత మాజీ కార్మికులకు రావలసిన కొత్త పెన్షన్ పేమెంట్ ఆర్డర్‌లలో పొరబా ట్లు సరిదిద్ది, సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.
ఆళవందార్ వేణుమాధవ్, హైదరాబాద్